మహబూబ్‌నగర్

2019లో కాంగ్రెస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలను పట్టించుకోవడంలో ఆధికారంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని,టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి ప్రజలు పంపించడానికి సిద్దంగా ఉన్నారని గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె ఆరుణ అన్నారు. మంగళవారం ధన్వాడ మండల కేంద్రంలో తన తండ్రి దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి వర్థంతిని పురస్కరించ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయమే ముఖ్య అతిథిగా హజరయ్యారు. అనంతరం దివంగత ఎమ్మెల్యే చిట్టేం నర్సిరెడ్డి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం స్థానిక విలేకఖరులతో గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను నేటికి నేరవేర్చిన దాఖలాలులేవన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు నీటిముటలుగానే మిగిపోతున్నాయని ఆరోపించారు. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మాణం చేస్తామని చెప్పి నేటికి ఇండ్ల జాడనేలేదని ఎద్ధేవా చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చేసిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. కానీ నేటికి వేయి ఉద్యోగాలు కుడా పూర్తి చేయాలేకపోవడం సిగ్గుచేట్టాన్నారు. రాష్ట్రంలో డిఎస్సీ జాడలేదన్నారు. టిఆర్‌ఎస్ పాలన మూడున్నర సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధిలో పూర్తిస్థాయిలో విఫలమైందని ఆమే ద్వజమెత్తారు. కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే గ్రామాలు అభివృద్ధి చెందడం జరిగిందని చెప్పారు. రైతులకు రూ,1లక్ష రూపాయలు మాఫి చేసిన ఘనత సోనియగాంధీకే దక్కిందన్నారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు మాఫి చేస్తామన్న బ్యాంకు రుణాలను సక్రమంగా మాఫీచేయాలేదని దుస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. ప్రజలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నమ్మకంపోయిందన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆమే ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో నారాయణపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ధన్వాడ మండల సింగిల్ విండో చైర్మన్ నాగూల నిరంజన్‌రెడ్డి, ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరి, నాయకులు ఎలిగండ్ల హన్మంతు, చిన్నబాలు, సూరిటి శ్రీనివాసులు, టైలర్ శ్రీనివాసులు, ఆనంద్, నరేందర్‌గౌడ్, బాలకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృష్టితోనే బంగారు తెలంగాణ
* పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి
వీపనగండ్ల, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే టిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని, అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్, టిడిపి పార్టీలను పాతేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవరం వీపనగండ్ల మండల కేంద్రంలోని రచ్చకట్ట దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే టిడిపి కనుమరుగయ్యిందని, మరో కొద్ది రోజుల్లో కాంగ్రెస్ కనిపించకుండా పోతుందన్నారు. ఆంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలు వలస వెళ్లారని గడిచిన మూడు సంవత్సరాల్లో వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి వస్తున్నారని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక టిడిపి, కాంగ్రెస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధిని ఆపేది లేదని బంగారు తెలంగాణ సాధించి తీరుతామని ఆయన అన్నారు. గ్రామ తాత్కాలిక సర్పంచు ప్రహ్లాద్‌రెడ్డి, మాజీ సర్పంచు గంగిరెడ్డి, మాజీ ఎంపిటిసి బుచ్చయ్యగౌడ్, మీసాల రాము, డప్పు రాము, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పార్టీలో చేరారు. పాన్‌గల్ సింగిల్‌విండో ఛైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ రవిందర్‌రెడ్డి, నాయకులు బొల్లారం సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి, ఎత్తం బాలస్వామి, ఎత్తం కృష్ణయ్య, రజాక్, శ్రీకాంత్, రవిందర్‌రెడ్డి, నాగులు, నారాయణ, ఆంజనేయులు పాల్గొన్నారు.
స్వచ్ఛ జిల్లాగా మార్చుదాం

* స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి జూపల్లి

నాగర్‌కర్నూల్, ఆగస్టు 15: అందరి భాగస్వామ్యంతో మహాత్మాగాంధీ జ యంతి నాటికి నాగర్‌కర్నూల్ జిల్లాను స్వచ్ఛజిల్లాగా మారుద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. 71వ స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలను స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా మైదానంలో కలెక్టర్ శ్రీ్ధర్, ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్‌లతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఎగరవేసి పోలీస్‌ల గౌరవ వందనం స్వీకరించా రు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడరు.