మహబూబ్‌నగర్

ఇంకుడు గుంతలతోనే గ్రామాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, ఏప్రిల్ 14: ప్రతి ఇంటికి ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టి గ్రామాభివృద్ధి కోసం అందరు కలిసి తోడ్పడాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.మండల పరిధిలోని బూరెడ్డిపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125 జయంతి వేడుకలల్లో పాల్గొన్న ఆయన ఈసందర్బంగా ఎర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్థులనుద్ధేశ్యించి ప్రసంగించారు.తాము నిర్మించే ఇంకుడు గుంతలకుప్రభుత్వం రూ.4000అందిస్తుందన్నారు.ఇంకుండు గుంత ల నిర్మాణం వల్ల గ్రామంలో మురికి లేకుండా పరిశుభ్రత కలిగి ఉంటుందన్నారు.తద్వారా ఆరోగ్యం బాగుంటుదన్నారు.వర్షాలు పడ్డప్పుడు వృధాగా పోయే నీరు ఇంకుడు గుంతలు నిర్మిస్తే వాటిలోకి చేరడం వల్ల మురికి నీరు గ్రామంలో ఎక్కడా కనిపించదని వివరించారు.గ్రామస్థులు కోరిక మేరకు గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా కల గామిగిలిపోయిన రోడ్డును మంజూరీ చేయడం జరిగిందని వివరించారు. సబ్ స్టేషన్ మంజూరీకి అభ్యతరం లేదని పేర్కొన్నారు. గ్రామంలో పశువుల ఆసుపత్రిని సైతం నిర్మించి ప్రారంభించామని తెలిపారు. గ్రామానికి ఇన్ని అభివృద్ధి పనులు చేపడ్తున్న తనకు రెండు నెలలో గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి మోడల్ గ్రామంగా నిలుస్తామని హామీ ఇవ్వాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. అంతకుముందు గ్రామంలో ఎర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి పాల భిషేకం చేశారు. అంబేద్కర్ లేకుంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఎర్పడి ఉండేది కాదని అన్నారు. ఆయన చిన్న రాష్ట్రాల ఎర్పాటుకు అనుకూలం అని తెలపారు. యావత్ తెలంగాణ ప్రజలు భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌కు రుణపడి ఉన్నారని తెలిపారు. ఈ సందర్బంగా గ్రామంలో రోడ్డును,పశువుల ఆసుపత్రిని ఆయన ప్రారంబించారు.అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మండల పరిధిలోని నాగసాల గ్రామంలో మిషన్ కాకతీయ రెండో దశ పనులను ప్రారంభించారు. అక్కడినుండి స్థానిక తహశీల్‌దార్ కార్యాలయంలో తహశీల్ దార్ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడకులకు హజరయ్యారు. బిఆర్ డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీటిసి జయప్రద,ఎంపిపి లక్ష్మి,టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్,మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, నాయకులు గోవర్ధన్ రెడ్డి, శంకర్ నాయక్, యూసుఫ్, విజయ్ కుమార్, రవిశంకర్ పాల్గొన్నారు.