మహబూబ్‌నగర్

అంతర్జాతీయ కరాటేలో జిల్లా క్రీడాకారిణికి బంగారు పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 17: ముంబాయిలోని కెడిఎస్ స్టేడియంలో శనివారం షోటోకాన్ కరాటే ఇండియా ఆసోసియేషన్ ఆద్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కరాటే టోర్నిలో జిల్లా క్రీడాకారిణి బంగారు పతకం సాదించింది. మాస్టర్ కేశవ్ షోటోకాన్ విద్యార్థి గాయత్రిఅండర్-16 కటాస్ విభాగంలో బంగారు పతకం పొందింది. గాయత్రిని శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందిన మాస్టర్లు అభినందించి బంగారు పతకం అందజేశారు., ఈ కార్యక్రమంలో ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కేశవ్‌గౌడ్, జిల్లాకు చెందిన కరాటే మాస్టర్లు అబ్దుల్ నబీ, నవీన్, హాజీ, శివకుమార్‌యాదవ్, వినయ్, సాయిబాబు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
* పలు ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేసిన బిజెపి శ్రేణులు
* కాంగ్రెస్, టిడిపి, టిజెఎసి ఆధ్వర్యంలో విలీన దినోత్సవం
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బిజెపి నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బిజెపిశ్రేణులు పలు ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పలు తహశీల్దార్ కార్యాలయాలపై బిజెపి నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. పలు మండలాల్లో బిజెపి నాయకులను వారించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎబివిపి ఆద్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేయడానికి యత్నించిన ఎబివిపి కార్యకర్తలను పోలీసులు ఆరెస్టు చేశారు. అయినప్పటికి కొందరు ఎబివిపి నాయకులు కలెక్టరేట్‌లోకి దూకెందుకు ప్రహారి గొడ ఎక్కి చేతిలో జాతీయ జెండాను పట్టుకుని తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎబివిపి నాయకులను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓ సందర్భంలో పోలీసులు ఎబివిపి విద్యార్థులను చెదరగొట్టారు. బిజెపి జిల్లా కార్యాలయంపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి జాతీయ జెండాను ఎగురవేయడమే కాకుండా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు వార్డులలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరిపేవరకు ఈ పోరాటం ఆగదని అన్నారు. ఇది ఇలా ఉండగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ విలీన దినం జరుపుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. తాము ప్రభుత్వపరంగా తెలంగాణ విలీన దినం జరపమని డిమాండ్ చేయడం లేదని ఈ దినాన్ని స్మరిస్తూ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేయడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా టిజెఎసి ఆద్వర్యంలో టిఎన్‌జిఓ కార్యాలయంపై జాతీయ జెండాను టిజెఎసి కో-చైర్మన్ చంద్రానాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నరసింహులు జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ ఉద్యమంలో ఈదినాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని కోరిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాకమాత్రం మాట మార్చారని ఆరోపించారు.