మహబూబ్‌నగర్

బతుకమ్మ చీరల్లో రూ.150కోట్ల కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, సెప్టెంబర్ 19: బతుకమ్మ చీరల పంపిణీలో రూ.150కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బిజెపి జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా ఉత్సవాల సందర్భంగా కుల మతాలకు అతీతంగా మహిళలందరికి చేనేత వస్త్రాలను ఉచితంగా అందజేస్తామని దీంతో చేనేతకు చేయూత ఇచ్చినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నదని, తీరా నాణ్యత లేని చీరలను మహిళలకు పంపిణీ చేసి పెద్ద ఎత్తున నిధులను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. సిబిఐచే విచారణ జరిపిస్తే ప్రభుత్వం బండారం బయటపడుతుందని అన్నారు.
చేనేత వస్త్రాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్పడంతో మహిళలు రెండు రోజుల పాటు కూలీ పని మానుకొని వేచి చూసి చివరకు నాణ్యత లేని చీరలను ఇవ్వడంతో ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో కొందరికి చేనేత చీరలు ఇచ్చినట్లు తెలిసిందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క మహిళకు చేనేత చీర ఇవ్వలేదని అన్నారు. ఈ అవినీతిలో అధికారులతో పాటు అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉందని వెంటనే ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించి నిజాయితిని నిరూపించుకోవాలన్నారు. లేనట్లు అయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నారాయణ, సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, పరుశరామ్, కుమారస్వామి పాల్గొన్నారు.
యాదవులకు గొర్రెల పంపిణీ
కొత్తకోట, సెప్టెంబర్ 19: ముసాపేట మండలంలోని చక్రాపూర్ గ్రామంలో కుర్వ యాదవులకు మంగళవారం గొర్రెలను ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మత్య్సకారులకు సబ్సిడితో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని చేతి వృత్తిలకు చేయూతనిస్తుందన్నారు. సాగునీరు అందించడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నారని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించి ఒండ్రు మట్టి ద్వారా రైతుల పంటపొలాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే తిమ్మాపూర్, పొల్కంపల్లి గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామన్‌గౌడ్, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు పొన్నకల్ మహిమూద్, నాగార్జున్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.