మహబూబ్‌నగర్

రూ.45వేల కోట్లతో సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాబుపేట, సెప్టెంబర్ 19: రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధి సంక్షేమాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం చేపడుతున్న వినూత్నమైన పథకాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మంగళవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని రుద్రారం, కారుకొండ గ్రామాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రభుత్వ పథకాలన్ని విజయవంతం అవుతుండడంతో ప్రతి పక్షపార్టీలు వాటిని భగ్నం చేయడానికి కుట్రపనుతున్నాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రతి పక్షపార్టీల కుట్రలను భగ్నం చేసి ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. ప్రజల పురోగతి ప్రతి పక్షాలకు అవసరం లేదని అందుకే రాజకీయాలు, రాద్ధాంతాలు చేస్తూ అధికార యావతో ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేస్తున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ఆచరణలో పెట్టి పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు కంటవింపుగా మారిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుడటంతో ప్రతిపక్ష పార్టీల పునాదులు కదులుతున్నాయని అందువల్లే అవి అనేక విమర్శలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అద్భుతంగా అములు అవుతున్నాయని రూ.45వేల కోట్లతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలిపే విధంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఇంతకు దిగజారిన ప్రతి పక్షాలు బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండి ఉండవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలకు పబ్బాలకు చీరా సారేలు పెట్టి ఆడపిల్లల ఆశీర్వాదాలు పొందడం మన భారతీయుల సంసృత్తి సాంప్రదాయమని ఆ సాంప్రదాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శీనయ్య, జడ్పిటిసి ఇందిరాదేవి, మార్కెట్ చైర్మన్ నర్సింహ్మాచారి, నాయకులు నర్సిములు, రవిందర్‌రెడ్డి, మదుసూధన్‌రెడ్డి, ఉమాపతిరెడ్డి, లక్ష్మయ్య, సర్పంచులు వీరప్ప, లక్ష్మి, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

బంగారు బతుకమ్మ కానుకే చీరలు
*ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్, సెప్టెంబర్ 19: బంగారు బతుకమ్మ కానుకగా తెలంగాణ ప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు చీరలను పంపిణి చేస్తుందని, మహిళలంటే తమ అధినేత కెసిఆర్‌కు ఎంతో గౌరవమని అని, మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మక్తల్ పట్టణంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి అడపడుచుకు సారె రూపంలో చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చీరలపై ప్రతిపక్ష పార్టీలు మహిళలకు లేనిపోని మాటలు నేర్పి వారిని తుప్పుదోవ పట్టించి అనేక రాద్ధాంతాలు సృష్టిస్తుండటం తగదని అన్నారు. మహిళలకు చీరలను పంపిణీ చేయడం తప్పా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాగే రుద్రసముద్రం, దాసర్‌పల్లి, మాధ్వార్, మంథన్‌గోడ్ గ్రామాలలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ సతీమణి చిట్టెం సుచరిత, మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్‌లు మహిళలకు చీరలను పంపిణి చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఓంప్రకాష్, ఎంపిడిఓ విజయనిర్మల, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపిటిసి రవిశంకర్‌రెడ్డి, శ్రీహరి, రాజశేఖర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రహీంపటేల్ పాల్గొన్నారు.
ఉట్కూర్‌లో...
ఊట్కూర్: బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాని ముఖ్యఅతిథిగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెంరాంమోహన్‌రెడ్డి హాజరై మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్ దసరా పండుగ పురష్కరించుకుని మహిళలకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని అయన తెలిపారు. తెలంగాణ అడపడుచులపై ఎంతో మమకారంతో ఉందని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి సూర్యప్రకాష్‌రెడ్డి, తహశీల్దార్ తిరుపతయ్య, ఎంపిడి ఒ రవికుమార్, ఎంపిటిసి గోవిందప్ప, ఉపసర్పంచ్ గోపాల్, నర్సిములు, శివరామరాజు, మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి, సుధకర్‌రెడ్డి, మహిళలు పాల్డొన్నారు.