మహబూబ్‌నగర్

ప్రజలను మోసగిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట , సెప్టెంబర్ 21: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్ళు గడిచినా ఎన్నికల ముందు తరువాత ప్రజలకు ఇచ్చిన హామిలను మరిచారని మాజి మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ విమర్షించారు. గురువారం అచ్చంపేట తహాశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రైతు సభలో పాల్గొని ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని రైతాంగాన్ని మోసగించడానికే రైతు సమన్వయ సమితులను సిఎం కెసిఆర్ తీసుకవచ్చారని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చేనేత చీరలు పంపిణీ చేస్తానని నమ్మించి రూ 222కోట్ల నిధులను మంజూరు చేసి రూ 75 కోట్లతో కిలోల లెక్కన సూరత్ చీరలు పంపిణీ చేసి రూ 150 కోట్లకుపైగా ప్రజల సొమ్మును టిఆర్‌ఎస్ నాయకులు గండె కొట్టారని విమర్శించారు. రేషన్ కార్డులో పేరున్న 18 ఏళ్ళు నిండిన మహిళలకే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని దాని మర్మం రాబోవు ఎన్నికల్లో ఓట్లను రాబట్టడానికేనని అన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులో కెఎల్‌ఐ కాలువల కింద సాగుచేస్తున్న ఆయకట్టు మునిగిపోతుందని దాంతో రైతులు నిర్వాసితులుగా మారుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు రైతులకు వ్యతిరేకం కాదని, నల్లగొండకు అచ్చంపేట చెంతనే ఉన్న ఎస్‌ఎల్‌బిసి ద్వారా సాగు, తాగునీటిని అందించాలని కాంగ్రెస్ పార్టీగా సూచిస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టును పెంచకుండ 80వేల కోట్లకు అంచనాలు పెంచుకొని కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్‌లు దండుకొంటున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో ముస్లింలు, గిరిజనులను మోసం చేస్తున్నారని, దళితులకు సిఎం పదవి, మూడెకరాలభూమి, మహిళలకు మంత్రి పదవి, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం, తాండాలను పంచాయతిలు లాంటి హామీలు నీటి మూటలుగా మిగిలాయని, తెలంగాణ ప్రజలకు స్వయం పాలనను ప్రసాదించిన సోనియ గాంధిని మోసగించి కెసిఆర్ స్వయంగా విదేశాల్లో ఉన్న కుటుంబసభ్యులను రాష్ట్రానికి రప్పించి మంత్రి పదవులు అధికారం కట్టబెట్టారని దుయ్యబట్టారు. పంటల పెట్టుబడికి 8వేలు వచ్చే ఏడాది ఇస్తామని ప్రకటించడం ఓట్ల కోసమే అని తేటతెల్లం అవుతోందన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కొల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి హర్షవర్దన్‌రెడ్డి, జడ్పిటిసిలు అనురాధ, సరిత, నాయకులు సుశీల, శ్రీనివాసులు, రాము మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలోని ఎన్‌టిఆర్ స్టేడియం నుండి తహాశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వివిధ డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ పాండుకు అందించారు.
విద్యార్థులకు క్రీడలు ఎంతో ఉపయోగకరం
* రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
బాలానగర్, సెప్టెంబర్ 21: నేటి సమాజంలో విద్యార్థులకు భవిష్యత్తులో క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం బాలానగర్ మండల పరిధిలోని పెద్దయపల్లి గ్రామశివారులో ఉన్న బాలుర గిరిజన గురుకుల కళాశాలల విద్యార్థుల క్రీడలను ప్రారంభించిన అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విద్య, క్రీడల అభివృద్ధి కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రాష్ట్రానికి మంచిపేరు తెచ్చేవిధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం గుండెడు గ్రామంలో మిషన్‌భగీరథ 20వేల లీటర్ల వాటర్‌ట్యాంక్‌కు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భాగ్యమ్మ, సర్పంచు గంగమ్మ, మేఘమాల, ఎంపిటిసి లక్ష్మయ్య, కళాశాల ప్రిన్సిపల్ నాగేందర్, నాయకులు వెంకటాచారి, చెన్నారెడ్డి, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.