మహబూబ్‌నగర్

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21: శాంతిభధ్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా నిలుస్తామని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి.అనురాధ వెల్లడించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా ఉదయం 11.35నిమిషాలకు ఆమె పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన ఎస్పీ అనురాధకు ప్రత్యేక పోలీసు బలగాలు గౌరవవందనం చేసి స్వాగతం పలికారు. డి ఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డిలు ఎస్పీ అనురాధకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనురాధకు జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ పోలీసు సహయం కోసం వచ్చే బాధితులకు తగు న్యాయం జరిగే విధంగా ఉత్తమ రక్షణ వ్యవస్థగా జిల్లా పోలీసు యంత్రాంగం నిలిచేవిధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు సేవచేసే భాగ్యం కలగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా సాంస్కృతిక, సామాజిక వారసత్వం ఎంతో ఉన్నతమైనదని తెలిపారు. ఇక్కడి ప్రజలు శ్రమజీవులని మేధోసంపన్నులుగా ఉండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశ నిర్మాణం కోసం ఎంతో శ్రమిస్తున్నారని ఇలాంటి జిల్లాలో తనకు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేదే లేదని జిల్లా ప్రజల సహకారంతో శాంతియుత వాతావరణంతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు సాఫిగా నడవడానికి పోలీసుశాఖ పనిచేస్తుందని అందుకు ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు తీసుకువస్తామన్నారు. జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు యువతకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామన్నారు. మహిళలపై జరిగే దాడులను తీవ్రంగా పరిగణిస్తామని మహిళల రక్షణ కోసం చట్టాలన్నింటిని ఉపయోగిస్తామన్నారు. నేరాల నివారణతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని నేరపరిశోధన విషయంలో కూడా నూతన టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. సమాజంలో నెలకొని ఉన్న వివిధ రుగ్మతలు ప్రతి వ్యవస్థకు అంటుకుని ఉండడం సహజమని పోలీసు సిబ్బంది మానవీయకోణంలో పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామన్నారు.