మహబూబ్‌నగర్

సమాజ శ్రేయస్సుకే సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వం వినూత్నమైన పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. మండల పరిధిలోని మాచారం, జడ్చర్ల,కోడ్గల్ గ్రామాలల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడంతో పాటు కోడ్గల్‌లో బతుకమ్మలతో స్వాగతించిన మహిళలతో కలిసి బతుకమ్మలను తలపై పెటుకొన్నారు. అలాగే కోడ్గల్ గ్రామంలో పశు సంచార వైద్యశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం లక్ష్మణ్ నాయక్ తాండలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ పడిపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాలల్లో నిర్వహించిన సభలలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలన్ని విజయవంతం కావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకచేతితో అభివృద్ధిని మరో చేతితో సంక్షేమాన్ని సమానంగా నడిపిస్తున్న ఘనత కెసీఆర్‌దని ఆయన కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో రూ.45వేల కోట్లతో అమలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. గొప్ప, గొప్ప పథకాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికి కోసం రాష్ట్ర ప్రభుత్వం పై బురద చల్లడం హేయమైన చర్య అని అన్నారు. ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని, మహిళలు వాటిని ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం అది చూసి ఓర్వలేక తమ అవివేకాన్ని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఈకార్యక్రమాలల్లో ఎంపిపి లక్ష్మి, జడ్పిటిసి జయప్రద,తహశీల్‌దార్ లక్ష్మినారయణ, మార్కెట్ చైర్మన్ శోభ గోవర్థన్ రెడ్డి,సర్పంచ్ బుక్కా వెంకటేశం, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య,గోవర్థన్‌రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.