మహబూబ్‌నగర్

ముగిసిన మద్యం టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, సెప్టెంబర్ 22: నారాయణపేట ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఒ పరిధిలో గల 16మద్యం దుకాణలకు 385మంది అభ్యర్థులు తమ టెండర్లను దాఖలు చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టెండర్లలో పాల్గొన్న అభ్యర్థులు ఉదయం నుండి వేచి చూడగా మధ్యాహ్నం నుండి నారాయణపేట డివిజన్‌కు చెందిన లక్కిడిప్‌ను ఎక్సైజ్ అధికారులు ప్రారంబించారు. అయితే మధ్యాహ్నం ప్రారంభమైన లక్కిడిప్ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ డిప్‌లో నారాయణపేటకు చెందిన వ్యాపారులతో పాటు హైదరాబాద్, గద్వాలకు చెందిన పలువురు సిండికేట్ వ్యాపారులు పాల్గొనగా ఎక్కువ మొత్తంలో వారికే టెండర్లు దక్కాయి. నారాయణపేట ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఒ పరిధిలో అధికశాతం టెండర్లు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు దక్కించుకోగా గుడ్‌విల్ చెల్లించి దుకాణాలను హస్తగతం చేసుకునేందుకు ఇప్పటికే వ్యాపారులు ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే టెండర్లు పొందిన వ్యాపారులు వారం రోజుల వ్యవధిలోగా తమకు సంబందించిన అన్నీ ధృవీకరణ పత్రాలను తమకు అందించాలని ఎక్సైజ్ అధికారులు టెండర్లు పొందిన వారికి ధృవీకరణ పత్రాలు అందించి అగ్రిమెంట్‌లు చేసుకున్నారు.
నాలుగు జిల్లాలకు తెదేపా రథసారధుల
నాలుగు జిల్లాలకు తెదేపా రథసారధులు

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: గత ఏడాది పాటు టిడిపి జిల్లా అధ్యక్షుల నియమాకంపై తర్జనభర్జన, సందిగ్థం నెలకొంది. ఎన్నో ఊహగానాలకు శుక్రవారంతో తెదేపా అధినాయకత్వం తెర దింపింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు తెలుగుదేశం రథసారధులను నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఆదేశానుసారంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్‌రెడ్డి నాలుగు జిల్లాల అధ్యక్షులను ప్రకటించారు. అందులో మహబూబ్‌నగర్ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను నియమించారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పగిడ్యాల శ్రీనివాస్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా రాములును నియమించగా, జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డిని నియమించారు. దింతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. రెండేళ్ల పాటు వీరి పదవికాలం కొనసాగనుంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా వీరే జిల్లా అధ్యక్షులుగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమించడంతో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకుని బాణసంచా కాల్చారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులు ఎర్రశేఖర్‌కు పార్టీ పదవి దక్కడంతో ఆయన అనుచరుల్లో నూతనోత్సహం కనబడుతుంది.
ఎర్రశేఖర్‌కు టిడిపి జిల్లా అధ్యక్షపదవి ఇవ్వడంతో ఈ ప్రభావం మూడునాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలపై మంచి ప్రభావం చూపుతుందనే అభిప్రాయంతో చంద్రబాబునాయుడు, ఎల్.రమణ, రేవంత్‌రెడ్డిలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎర్రశేఖరే జిల్లా అధ్యక్ష పదవికి అర్హుడని రాబోయే ఎన్నికల్లో ఈయన ప్రభావం జిల్లాపై ఉంటుందని దింతో మంచి ఫలితాలనే సాధించవచ్చనే ఉద్దేశ్యంతో తెదేపా అధినాయకత్వం ఎర్రశేఖర్‌కు పార్టీ పగ్గాలను అప్పజెప్పింది. వనపర్తి జిల్లా అధ్యక్ష పదవికి ఒక మాజీ ఎమ్మెల్యే యత్నించినప్పటికిని చివరిగా మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడికే పార్టీ పగ్గాలను అప్పగించడంలో రావుల తన సత్తా చాటుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో శ్రీనివాస్‌రెడ్డి, గద్వాలలో రాంచంద్రారెడ్డిల నియమాకంతో పార్టీకి మంచి జరుగుతుందని అందరు భావిస్తున్నారు.