మహబూబ్‌నగర్

పెద్ద చెరువును పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌గా రూపాంతరం చెందుతున్న పాలమూరు పెద్దచెరువును మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు పరిశీలించారు. బతుకమ్మ సంబురాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్దచెరువు దగ్గర రాత్రివేళలో విద్యుత్‌దీపాల వెలుగులు నిరంతరంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అదేవిధంగా పెద్దచెరువులో బోట్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌లు షికారు చేశారు. బతుకమ్మ నిమజ్జనాలకు ప్రతిరోజు మహిళలు ఇక్కడి వస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి సంబంధిత అధికారులకు సూచించారు.

ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ
గద్వాల, సెప్టెంబర్ 22: జోగుళాంబ గద్వాల జిల్లాలో మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శుక్రవారం లాటరీ పద్ధతిలో ప్రశాంతంగా ముగిసింది. జమ్మిచేడు సమీపంలోని తెలంగాణ టూరిజం హరితహోటల్‌లో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు పెద్దసంఖ్యలో దరఖాస్తులు పాల్గొన్నారు. 24దుకాణాలకు 461 దరఖాస్తులు రాగా, కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, ఎక్సైజ్ అధికారులు లాటరీపద్ధతిలో దుకాణాలను లబ్ధిదారులకు ఎంపిక చేశారు. రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు మద్యం దుకాణాలను దక్కించుకోవాలని పెద్దసంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఇరుపక్షాలకు మిశ్రమ స్పందనలే కన్పించాయి. అధికార పార్టీకి చెందిన అభిమానులకు కొంత మేర ఎక్కువ దుకాణాలు దక్కినట్టు ప్రచారం సాగుతోంది. పట్టణంలోని షాపు నెం.1 చంద్రశేఖర్, 2 మహేశ్వరి, 3 ఎంకె ఆంజనేయులు, 4 బోయ రాఘవేందర్, 5 రామిరెడ్డి, 6 టి.వెంకట్రాములు, జమ్మిచేడు శ్రీనివాసగౌడు, అయిజ నగర పంచాయతి షాపు నెం.1 గుప్త రాఘవేంద్రకుమార్, 2 పెద్దింటి బస్వరాజు, 3 వీరన్నగౌడు, 4 మధుసూదన్‌గౌడు, 5 యు.రామచందర్, మల్దకల్ మండల కేంద్రంలోని షాపు ఎం.శ్రీను, గట్టు ఎన్.రామేశ్వర్‌రెడ్డి, ధరూరు గోపాల్‌రెడ్డి, అలంపూర్ రామనర్సింహారెడ్డి, వడ్డేపల్లి వెంకట్రాములు, రాజోలి మహేష్‌బాబు, ఇటిక్యాల షాపు నెం.1 రాజశేఖర్, 2 తిమ్మారెడ్డి, ఉండవెల్లి మండలం షాపునెం.1 యుగేందర్‌రెడ్డి, 2 విష్ణువర్ధన్‌గౌడు, మానోవపాడు కె.కృష్ణలకు షాపులు లాటరీ పద్ధతిలో వరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్, అధికారులు పాల్గొన్నారు.