మహబూబ్‌నగర్

బ్రహ్మచారిణిగా జోగుళాంబదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, సెప్టెంబర్ 22: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగుళాంబదేవి సమేత బాలబ్రహ్మేశ్వరస్వామి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం రెండవ రోజు జోగుళాంబదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం చండీహోమం, సహస్రనామార్చన, కుంకుమార్చన తదితర పూజలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అంతకు ముందు బాలబ్రహ్మేశ్వరస్వామి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి మేళతాళాలతో అమ్మవారికి ఆలయానికి చేరుకున్నారు. సాయంత్రం అమ్మవారి దర్భార్ సేవలో కుమారి, సుహాసిని, మహామంగళహారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాయంత్రం కొలువు పూజలో బ్రహ్మచారిణి అలంకరణలో అమ్మవారు పూజలందుకున్నారు. నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని బ్రాహ్మచారిణిగా భక్తులు ఆరాదిస్తారు. అమ్మవారు శుద్ధ పటికావరణంతో ప్రకాశిస్తూ మంచు స్వభావం కలిగి, సాధువుగా చేతిలో పుస్తకం, జపమాల, కమండలము, డందం కలిగి ఉంటారు. బ్రహ్మచారిణి మాతను ఆరాదించడం వల్ల జీవితంలో వచ్చే ఒడిదుడుగులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందుతారని అర్చకులు విక్రాంతిశర్మ, శ్యాంకుమార్‌శర్మలు తెలియజేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుపూజకు అమ్మవారి మాలధరించిన స్వాములు పల్లకిసేవలో తీసుకువచ్చారు. కలెక్టర్ వెంట టిడిపి నాయకులు ఆంజనేయులు, ముజీబ్ తదితరులు ఉన్నారు.