మహబూబ్‌నగర్

కన్నులపండువగా సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, ఏప్రిల్ 15: ఆమనగల్లు మండలంలోని మైసిగండి గ్రామంలో ఉన్న శివాలయంతో పాటు ఆమనగల్లు, కడ్తాల వివిధ గ్రామాల్లో సీతారామచంద్రస్వామి కళ్యాణం కన్నుల పండువగా అంగరంగ వైభవంగా జరిగింది. మైసిగండి గ్రామంలోని రామాలయంలో రాష్ట్ర దేవాదయ ధర్మదాయ శాఖ నుండి వచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ కమీషనర్ భారతి లక్‌పతి నాయక్‌లు అర్చకులకు సమర్పించారు. వేదమంత్రోచ్చరణల మధ్య రాములోరి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆమనగల్లు పట్టణంలో ఉన్న అంజనేయస్వామి దేవాలయం వద్ద కొదండరామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జడ్పీటిసి హరిప్రసాద్, ఎంపిపి లలితమ్మ, సింగల్ విండో చైర్మన్ దశరథ్‌నాయక్, ఎంపిటిసిలు ఝూన్సీ, శ్రీనివాస్‌గౌడ్, సత్యనాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కేశవులు, సర్పంచ్ కరుణశ్రీ పాల్గొన్నారు.
మాగనూర్‌లో...
మాగనూర్: మండల పరిధిలోని కుంతి గ్రామంలో వెలసిన వేణుగోపాలస్వామి జాతర బ్రహోత్సవాల సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున వైభవంగా ప్రభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రభోత్సవానికి చుట్టూపక్కల గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు, గ్రామపేద్దలు, మహిళలు, చిన్నారులు ప్రభోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు.
కల్వకుర్తిలో...
కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని షిరిడి సాయిబాబా, శ్రీ అంజనేయస్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతరాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీ రామ నవమి సందర్భంగా శుక్రవారం ఉదయం నుండి స్వామి అభిషేకం, అలంకరణ, సహస్ర నామార్చణ తదితర కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నాం 12 గంటల 30 నింషాలకు వేద పండితులు సీతా రాములకు అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు. మండు ఎండను సైతం లెక్క చేయకుండా పట్టణ భక్తులతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి సీతారాముల కల్యాణం తిలకించారు. అదేవిధంగా పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి, శ్రీఅంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డితో పాటు నగర పంచాయతీ చైర్మన్ శ్రీశైలంలు హజరయ్యారు. సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమంలో వాసవి మాత దేవాలయ పౌండర్ జూలురి చంద్రవౌళి, ప్రముఖ వ్యాపార వేత్త రమేష్‌బాబు, వాసవి, వనిత క్లబ్‌ల అధ్యక్ష, కార్యదర్శులు, సాయి బాబా దేవాలయ నిర్వహకులు క్రాంతికుమార్, అర్చకులు సాగర్, అలయ సభ్యులు రమేష్, వెంకట్‌రెడ్డి, ఈశ్వరయ్య, జ్యోతి, సత్యం భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్‌లో...
మక్తల్: అంతా రామమయం జగమంతా శ్రీరామ మయం. శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా శుక్రవారం మక్తల్ పట్టణంతో పాటు మండలంలోని వివిద గ్రామాలలో రాములోరి పెళ్లి సందడి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పచ్చని పందిళ్లు..ముత్యాల తలంబ్రాలు..పట్టు వస్త్రాలు..సన్నాయి వాయిద్యాలు..ఏఆలయంలో చూసిన కోదండ రాముడి కమనీయకల్యాణ వేడుకల సందడేనని చెప్పవచ్చు. ఆలయాలన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి.’’ ఆదర్శమూర్తి, లోకసుగుణ దాముడు శ్రీరామచంద్రడి పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు అంగరంగ వైభవంగా ఈ సందర్భంగా మక్తల్ పట్టణంలోని శ్రీపడమటి ఆంజనేయస్వామి దేవాయల ఆవరణలోని శ్రీరామలీల మైదానంలో జరిగాయి. విశ్వహిందుపరిషత్, బజరంగదళ్, హిందూవాహిని, శ్రీపడమటి ఆంజనేయస్వామి దేవాలయ కమిటి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరాములోరి కల్యాణానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు భారులు తీరారు. వంశ పారంపర్య ధర్మకర్త భీమాచారి ఆధ్వర్యంలో వారి కుమారుడైన ప్రాణేశాచారీ దంపతులు, భక్తుల ఆనందోత్సవాల మధ్య కన్నుల పండుగగా, చూడముచ్చటగా సీతారామయ్యల పెళ్లి జరిగింది. సీతారామయ్యల కల్యాణానికి ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి చిట్టెం సుచరితలతోపాటు జడ్పీటీసి వాకిటి శ్రీహరి, ఎంపిపి కోళ్ల పద్మమ్మ, సర్పంచ్ భాగ్యచంద్రకాంత్‌గౌడ్, పిసిసి సభ్యులు శ్రీనివాస్‌గుప్త బిజెపి నాయకులు కొండయ్యలు ముఖ్యఅతిథిగా హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములోరి కల్యాణానికి ఎమ్మెల్యే చిట్టెం దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.