మహబూబ్‌నగర్

బూత్ స్థాయి నుంచి బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూత్పూర్, సెప్టెంబర్ 24: గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి అందరు కృషి చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని పోతులమడుగు గ్రామంలో బిజెపి మండల పార్టీ కార్యవర్గ సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు అనుప నర్సిములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైన పద్మజారెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికలే లక్ష్యంగా దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాలలో బూత్‌స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభవృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా సూచించాలని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని తెలిపారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అవలంభిస్త్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ఎండగట్టాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అములు చేస్తుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన భజనపరులు మాత్రం ఆ పథకాలు రాష్ట్ర ప్రభుత్వానివని చెప్పుకుంటున్నారని ఈ విషయంపై కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావలని అన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తప్పకుండా బిజెపి అధికారంలోకి వచ్చి తీరుతుందని జిల్లాలో కూడా మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గలతో పాటు మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర కిషాన్‌మోర్చ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎగ్గని నర్సిములు, దేవరకద్ర నియోజకర్గ కన్వీనర్ రవిందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెష్, నాయకులు శివలింగం పాల్గొన్నారు.
నేడు జడ్చర్లలో గవర్నర్ పర్యటన
జడ్చర్ల, సెప్టెంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న భూ సర్వే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సోమవారం జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామాన్ని సందర్శించి భూసర్వే కార్యక్రమాన్ని పరిశీలించనున్నారు. రాష్ట్రంలో భూముల సర్వేకు సంబందించి గందరగోళంగా ఉన్న రికార్డులను సరిచేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. భూముల రికార్డులన్నింటిని కంప్యూటరీకరణ చేసి భవిష్యత్తులో వీటికి సంబందించి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండేందుకు గానూ నిర్వహిస్తున్న సర్వే అమలు తీరును పరిశీలించి అధికారులకు దిశానిర్ధేశం చేయడానికి గవర్నర్ నరసింహన్ నాగసాలకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం గవర్నర్ పర్యటన ఎర్పాట్లను జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ నాగసాల గ్రామాన్ని ఆదివారం పరిశీలించారు. గవర్నర్ పర్యటన మొదట నియోజకవర్గంలోని నవాబుపేట మండలం కాకర్జాల గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించినా సెక్యూరిటీ సమస్య కారణంగా నాగసాల గ్రామాన్ని చివరి నిమిషంలో మార్చి ఖరారు చేశారు.