మహబూబ్‌నగర్

కల్వకుర్తి ప్రాజెక్టుపై షో చేస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, సెప్టెంబర్ 24: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాగునీటిపై కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు మేమే సాగునీరు తెస్తున్నట్లు షో చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అచారి విమర్శించారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 90 శాతం కాల్వ పనులు పూర్తి కావడం జరిగిందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచిన కెఎల్‌ఐ ప్రాజెక్టుపై ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. కాల్వ పనులు 18 మీటర్లకు తీయాల్సి ఉన్నా 8 మీటర్లతోనే సరిపెడుతున్నారని ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎందుకు స్పందించడం లేదన్నారు. నల్గొండ జిల్లాలో చేసే ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి అవుతున్నా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మాత్రం ముందుకు సాగడం లేదని ఆరోపించారు. గతంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సెప్టెంబర్, అక్టోబర్ నాటికి సాగునీరు అందిస్తామని కల్వకుర్తి రైతాంగానికి ఇచ్చిన హామీతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కెఎల్‌ఐపై అవగాహన లేనోళ్లు అవగాహన సదస్సులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కెఎల్‌ఐ ప్రాజెక్టు వారు రాజకీయ జీవితంలో పుట్టక ముందే రూపకల్పన చేశారని ఆయన ఎద్దేవా చేశారు. కెఎల్‌ఐ పనులు త్వరగా పూర్తి చేసి నాగిళ్ల వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు, రంగారెడ్డి, కెఎల్‌ఐ ప్రాజెక్టులను పూర్తి చేసి త్వరగా సాగునీరు అందించకుంటే అమనగల్లు చెరువు లోపలి నుండి వెళ్లిన మిషన్ భగీరథ పైపులను పగలగొట్టి చెరువులలో నీరు నింపుకుంటామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో కౌన్సిలరు విజయ్, బిజెపి జిల్లా కార్యదర్శి దుర్గప్రసాద్, నాయకులు సంతు, నర్సింహ్మ, చంద్, మల్లేష్, శేఖర్‌రెడ్డి, శ్రీకాంత్, రాఘవేందర్ పాల్గొన్నారు.
కోయిల్‌సాగర్ నుండి సాగునీరు విడుదల
ధన్వాడ, సెప్టెంబర్ 24: మరికల్ మండల పరిధిలోని కన్మనూర్ గ్రామానికి ఆదివారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేశారు. దింతో కన్మనూర్ గ్రామ రైతులు అనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ పంటలకు ఇట్టినీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు అధికారులు కోరుతున్నారు. గత కొంతకాలంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు సాగునీరు విడుదల చేశారు. సాగునీరు విడుదల చేయడంతో పంటల సాగుకు మరింత చేయూతను అందిచినట్లు అయిందని రైతులు చెబుతున్నారు.