మహబూబ్‌నగర్

ఎంజికెఎల్‌ఐ కాలువలలో కృష్ణాజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 24: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. గతేడాది ప్రారంభమైన ఎంజికెఎల్‌ఐ ప్రాజెక్టు నుంచి ఈ యేడాది కూడా నీరు వస్తుండటంతో ఈ ప్రాంతంలోని రైతులలో ఆనందం నెలకొంది. గత వారం రోజుల క్రితం వరకు శ్రీశైలం జలాశయంలో ఆశాజనకంగా నీరు లేకపోవడంతో ఈ యేడాది ఎంజికెఎల్‌ఐ ప్రాజెక్టు నుంచి నీరు రావనే నిరాశతో ఉన్న అన్నదాతలకు కృష్ణా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వానలతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు రావడం, ఎంజికెఎల్‌ఐ మూడు లిప్టులను నడుపుతూ నీటిని వదులుతుండటంతో ఈ ప్రాంతంలోని రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎంజికెఎల్‌ఐలోని మూడు లిప్టులలో మొదటి లిప్టులలోని మూడు మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తూ కిందికి వదులుతున్నారు. పైనుంచి కాలువల ద్వారా వస్తున్న నీటిని జొన్నలబొగుడ రెండో లిప్టులోని రెండు పంపులతో నీటిని పంపింగ్ చేస్తూ జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను నింపి కాలువల ద్వారా కిందికి వదులుతున్నారు. మూడో లిప్టులోని రెండు మోటార్లను ఆన్‌చేసి గుడిపల్లి రిజర్వాయర్‌ను నింపి 30వ ప్యాకేజిలోని అచ్చంపేట బ్రాంచి కెనాల్ ద్వారా, 29వ ప్యాకేజిలోని కల్వకుర్తి బ్రాంచి కెనాల్ ద్వారా నీటిని వదులుతున్నారు. గుడిపల్లిగట్టు రిజర్వాయర్ నుంచి 2.70లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా నేటికి 29వ ప్యాకేజి పనులు నామమాత్రంగానే జరిగాయి. గతేడాది కల్వకుర్తి ప్రాంతానికి నీరు రాకపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు నిర్వహించడంతో ఈ యాసంగిలో నీరు ఇస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. ఆ హామి మేరకు ప్రధాన కాల్వ పనులు పూర్తికాకున్నప్పటికి తాత్కలిక పనులతో మరో పదిరోజులలో ఆ ప్రాంతానికి నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కాలువల ద్వారా నీటిని వదులుతున్నప్పటికి, నీటి ప్రవాహాన్ని బట్టి చివరి ప్రాంతానికి నీరు అందేందుకు కనీసం 10రోజులైన పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా గుడిపల్లి రిజర్వాయర్ నుంచి 29వ ప్యాకేజిలోని ప్రధాన కాలువలకు నీరు వదులుతుండటంతో ప్రధాన కాలువల ద్వారా నీరు పారుతున్నది. ప్రధాన కాలువల ద్వారా నిర్మించిన డిస్ట్రిబ్యూటరీల ద్వారా చెరువులను నింపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటుండగా యాసంగిలో పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న రైతులు తొందరగా చెరువులు, కుంటలు నిండాలనే ఆతృతతో ఉన్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు తగ్గిపోతే మోటార్లు ఆపేస్తారని, దీనితో మా చెరువులు నిండకపోవచ్చనే భయంతో ఉన్నారు. గతేడాది అధికారులకు తెలియకుండానే ఆయా ప్రాంతాల ప్రజలు ప్రధాన కాలువలకు గండికొట్టి నీరు మళ్లించడం జరిగింది. ఈ యేడాది కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తే కేసులు పెడుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాలువలకు గండి పెడితే మున్ముందు వివిధ సమస్యలకు దారితీస్తాయని, ఎవ్వరు కూడా గండి పెట్టవద్దని, ఎవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తెస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. మొత్తంమీద ఎంజికెఎల్‌ఐ మూడు లిప్టులు నడుస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలలో ఆనందం వ్యక్తమవుతున్నది. ముందుగా ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపి ఇతర ప్రాంతాలకు వదలాలని కోరుతున్నారు.