మహబూబ్‌నగర్

వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 12: వసతిగృహాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు సూచించారు. గురువారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో బిసి, ఎస్సీ, ఎస్టీ హస్టళ్ల వార్డెన్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోనే 17 సంక్షేమ హస్టళ్లు ఉన్నాయని వాటిని అన్నివిధాలుగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. 17హస్టళ్లలో దాదాపు 4వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అధికారులు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూనే సాంఘీక సంక్షేమ హస్టల్‌లో చదువుకున్న విద్యార్థులు చదువులో కూడా మంచిగా రాణించేలా కృషి చేయాలన్నారు. కరెంట్ బిల్లులు ప్రతినెల చెల్లించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి హస్టల్‌కు సొంత భవనాలు ఉండేలా ప్రణాళికలు రచించి సంబందిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులకు దరఖాస్తు రూపంలో ప్రణాళికలు సిద్దంగా చేసి ఇవ్వాలని ఆదేశించారు. ప్రతినెల కరెంట్ బిల్లులు చెల్లించేలా క్రమంతప్పకుండా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్టీ స్టడీ సర్కిల్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నామని అందుకు సంబందిత అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతినెల మొదటివారంలో ఎదో ఒక వసతిగృహాన్ని సందర్శించడం జరుగుతుందని ఆ తేదిని తానే నిర్ణయిస్తానని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వసతిగృహాల ఆవరణలో పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో బిసి వెల్ఫెర్ జిల్లా అధికారి విద్యాసాగర్, ఎస్‌డబ్ల్యూ ఓ విజయలక్ష్మీ, ఏటిడిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఏనుగొండ సమీపంలో గల మహేశ్వరి థియేటర్ వెనుక వర్షానికి రోడ్లు జలమయమై ఇళ్లమధ్యలో నీరు నిలువ ఉండడాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. సంబందిత అధికారులతో మాట్లాడుతూ నీరు కిందివైపు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిసిరోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. అంతేకాకుండా గజిటెడ్ ఉద్యోగుల సంఘ సమావేశానికి కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, ఎంపిపి సావిత్రి, కౌన్సిలర్ వనజ, జడ్పిటిసి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాలకు నీటమునిగిన
వరి, వేరుశనగ పంటలు
కొత్తకోట, అక్టోబర్ 12: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. గురువారం మండల పరిధిలోని పాలెం, కనిమెట, చర్లపల్లి గ్రామాల్లో సాగు చేసిన వేరుశనగ, వరి పంటలను ఎఓ శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని వరి 102 ఎకరాలు దెబ్బతిన్నదని, అలాగే వేరుశనగ 35 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. కాగా వర్షాలకకు నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదిక ప్రభుత్వానికి పంపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఇఓ, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
నష్టపోయిన పంటలను పరిశీలించిన అధికారులు
* 1200 ఎకరాల్లో కాటన్ పంట నష్టం
మక్తల్, అక్టోబర్ 12: మండల పరిధిలోని మంథన్‌గోడ్, యర్నాగన్‌పల్లి, కాట్రేవ్‌పల్లి, టేకులపల్లి, భూత్పూర్, గోలపల్లి గ్రామాల్లో గురువారం వ్యవసాయశాఖ అధికారులైన ఎఇఓ కృష్ణకాంత్ బృందం నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా పై గ్రామాల్లో వేసినటువంటి కాటన్ పంట దాదాపు 1200 ఎకరాల్లో పూర్తిగా నష్టపోయినట్లు ఎఇఓ తెలిపారు. అలాగే వరి 30 శాతం, కంది 35 శాతం వరకు పూర్తిగా నష్టపోయినట్లు చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షపు నీరు పొలాల్లో నిలవడంతోటి చేతికొచ్చిన పంటలకు తీవ్రనష్టం వాటిల్లినట్లు తెలిపారు. పత్తికాయలు పలిగి వాటిలోని గింజలు మొలకెత్తడంతోటి నల్లబారి పోయాయని అన్నారు. కందిచేలో నీటి నిల్వ అధికంగా ఉండటంతోటి కంది చేలు సగం వరకు మురిగి పోయి రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తాము పరిశీలించిన పంటల నష్టాన్ని ప్రభుత్వానికి నివేధిస్తామని ఎఇఓ కృష్ణకాంత్ తెలిపారు.