మహబూబ్‌నగర్

ఓటర్ల జాబితా సమగ్రంగా పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 17: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపాలిటీ, నరగ పంచాయతీ ఓటరుల లిస్టుల సమగ్ర పరిశీలన పూర్తి చేసి సవరించిన ఓటరు లిస్టులను 2018 జనవరి 15లోగా ముద్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బూత్‌లేవల్ అధికారులు, సూపర్‌వైజర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ రోనాల్గ్‌రోస్ మాట్లాడుతూ ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వారిగా మున్సిపల్ సిబ్బంది బూత్‌లేవల్ అధికారులతో టీంను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. వారు పోలింగ్ స్టేషన్లకు సంబందించి మ్యాప్‌లను తయారు చేయాలని తెలిపారు.
నవంబర్ 1వ తేది నుండి ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు లిస్టులను అవసరమైన మేర సవరించి ఈనెల 20వ తేది పూర్తి చేయాలని అన్నారు. సవరించిన ఓటరు లిస్టులను 2018 జనవరి 15లోగా పూర్తి చేయాలని అన్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ పరిధిలోని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బూత్‌లేవల్ అధికారికి ఒక ట్యాప్ ఇవ్వడం జరుగుతందని అన్నారు. దాని ద్వారా ఎప్పటికప్పుడు డాటాను ఆప్‌లోడ్ చేయాలని అలాగే ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్లు లిస్టు సవరణకు సంబందించిన అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశానికి నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య, డిఆర్‌ఓ జగదిశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమీషనర్లు, సిబ్బంది బూత్‌లేవల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంస్మరణ దినానికి సర్వం సిద్ధం
వనపర్తి, అక్టోబర్ 17: పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. కార్యక్రమాల్లో భాగంగా ముందుగా పరేడ్‌ను చేసి పోలీసులు ట్రయల్ చేశారు. సమాజ రక్షణకై తీవ్రవాద, సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసుల వీరులకు నివాళి అర్పించే కార్యక్రమంలో పరేడ్‌ను నిర్వహించడానికి సాయుద బలగాలు సిద్ధమయ్యాయి.