మహబూబ్‌నగర్

రోడ్డు ప్రమాదాల నివారణలో నియమాలు విధిగా పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, అక్టోబర్ 17: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు నియమాలను విధిగా పాటించి ప్రమాదాలు జరుగకుండా చూసుకోవలసిన బాధ్యత వాహనదారులు, ప్రజలపై ఎంతో ఉందని, ద్విచక్రవాహనదారులైన ప్రతి ఒక్కరు విధిగా హెలిమెట్‌ను ధరించి సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని జిల్లా మోటారు వేకిల్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని మక్తల్ పట్టణంలోగల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు రోడు ప్రమాదాల నివారణ, చెట్లను పెంచే కార్యక్రమం, నీటి సంరక్షణ వంటి అంశాలపై హెచ్‌ఎం అనీల్‌గౌడ్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎంవిఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల తప్పిదంలో అనేక రకాలు ఉన్నప్పటికి తమ వంతు బాధ్యతగా రోడ్డు ప్రమాద సూచనలను, సలహాలను పాటించి తమ విలువైన ప్రాణాలను ప్రజలు కాపాడుకోవుటలో మేల్కొనాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు తమ కుటుంబంలోని వారు ద్విచక్ర వాహనంపై వెళుతున్నప్పుడు డ్రైవింగ్ చేసేవారు, వెనుక కూర్చున్న ఇద్దరు విధిగా హెల్మెట్‌ను ధరించి వెళ్లేంత వరకు మీరు వారి వాహనాలను బయటకు పంపకుండా అడ్డుపడితే వారిలో కొంత మార్పు రాగలుగుతుందని చెప్పారు. కారు ప్రయాణంలో సైతం సీటు బెల్టును విధిగా ధరించి వెళ్లాలని తెలిపారు. ప్రమాదాలకు మూలకారణం వేగంగా వాహనాలను నడుపడటం, మద్యం సేవించి వాహనాలు నడుపడం, ఓవర్‌టేక్ చేయడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపడం, మలుపుల వద్ద అతివేగంగా వాహనాలను నడుపడం, కెపాసటికి మించి ప్రయాణికులను చేరవేయడం వంటి అనేక రకాల కారణంగా నేడు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఎంవిఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను పొంది డ్రైవ్ చేయాలని సూచించారు. అలాగే విద్యార్థులుకానీ, ప్రయాణికులుకానీ బస్సు టాపుపై ఎక్కి ప్రయాణం చేయుట, గూడ్స్ వాహనాలలో వెళ్లి ప్రమాదాలకు లోనుకావడం వంటివి మానుకున్నప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా ప్రతి వాహనానికి ఆర్టీ, ఇన్స్‌రెన్స్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాలను నడుపుటకు అర్హులుగా భావించి డ్రైవింగ్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం అనీల్‌గౌడ్, ఉపాధ్యాయులు అరుణ, గురురాజరావు, రాములు, అనంత్‌రెడ్డి, తిరుపతయ్య, రమేష్, నర్సప్ప, దివాకర్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.