మహబూబ్‌నగర్

రైతులకు అండగా కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, అక్టోబర్ 22: ఇటివల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఆదివారం బాలానగర్ మండలంలోని గుండేడు, ఉడిత్యాల, నందారం గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో కలిసి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మల్లురవి, కాంగ్రెస్ కిసాన్‌సెల్ రాష్ట్ర కన్వినర్ కొదండరెడ్డిలతో పాటు కాంగ్రెస్ నేతలు వ్యవసాయ పొలాల్లోకి వచ్చి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ముందుగా ఉడిత్యాల గ్రామంలోని కుమ్మరి శ్రీనివాసులు, గొబ్య్రానాయక్ అనే ఇద్దరు రైతుల పంటలను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. వీరితో ముఖాముఖిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ తాను 8ఎకరాల పత్తిపంట వేశానని వర్షాలతో దాదాపు పంట 80శాతంకుపైగా పంట దెబ్బతిందని తమను ఆదుకోవాలని కోరారు. గొబ్య్రానాయక్ రైతు కూడా తన గోడును వెళ్లబోసుకుంటూ తాను కూడా దాదాపు 10 ఎకరాల్లో మొక్కజోన్న సాగుచేశానని వర్షాల కారణంగా నష్టపోగా అంతకుముందు వర్షం లేక కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుండేడు గ్రామంలో మహిళ రైతు మణెమ్మను కలిసి ఆమె సాగుచేసిన పత్తిపంటను పరిశీలించారు. రెండు ఎకరాల్లో పత్తిపంట సాగుచేయగా రెండు ఎకరాలకు కలిపి క్వింటాల్ పత్తిమాత్రమే వచ్చిందని దింతో తమ కుటుంబం రోడ్డుపడే పరిస్థితి ఏర్పడిందని తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలతో ఆమె మోరపెట్టుకున్నారు. అదేవిధంగా నందారం గ్రామంలో లింగ్యానాయక్ అనే గిరిజన రైతు పంట పొలాన్ని పరిశీలించారు. తాను మూడు ఎకరాల్లో పత్తిపంట సాగుచేశానని భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన పత్తి అంతా నాశనం అయ్యిందని తమను ఆదుకుంటే తప్పా అప్పుల నుండి బయటపడలేమని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు లింగ్యానాయక్. ఈ ఏడాది పంటసాగుకోసం బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని తాను రూ.3ల వడ్డీతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పుచేసి పత్తిపంట సాగుచేశానన్నారు. అధికారులు ఎవరూ కూడా ఇంతవరకు వచ్చి పంటలను పరిశీలించలేదని కాంగ్రెస్ నేతల దృష్టికి రైతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధైర్యాన్ని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మీ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోరాటం చేస్తానని తెలిపారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రైతులకు న్యాయం జరిగిందని ఏకకాలంలో రుణమాఫీలు, వడ్డీమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి నాలుగు విడుతలుగా మాఫీ చేశామని చెప్పుకుంటునప్పటికిని ఇంకా బ్యాంకుల్లో రైతులకు అప్పులు అలాగే మిగిలిపోయాయని ఇది కెసి ఆర్ పాలనకు నిదర్శనమని ఎద్దెవా చేశారు. రైతులు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు తగిన బుద్దిచెప్పి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి రూ.2లక్షల రుణమాఫీని పొందాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదిరమణరెడ్డి, శంకర్‌నాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, బంగ్లారవి, హార్యానాయక్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.