మహబూబ్‌నగర్

బంగారు తెలంగాణే కెసిఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతినగర్, అక్టోబర్ 22: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోరిక మేరకు సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంచి బంగారు తెలంగాణ సాధించడమే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ధ్యేయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. వడ్డేపల్లి, రాజోలి మండలాలలోని 9 నూతనంగా ఏర్పాటు చేయనున్న ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ.13 లక్షలతో కార్యాలయాలకు భూమి పూజ చేశారు. అనంతరం రూ.15 లక్షలతో నిర్మించనున్న విద్యుత్ కార్యాలయానికి, రూ.1.40 కోట్లతో పచ్చర్ల గ్రామంలో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమి పూజ చేశారు.
అనంతరం రాజోలి మండల పరిధిలోని చిన్నధన్వాడ మండలంలో రూ.13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాదికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నడిగడ్డ రైతాంగానికి తాగు, సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనాథ్, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిపి ఎన్.శ్రీనివాసులు, చేనేత సంఘం అధ్యక్షుడు దోత్రేనారాయణ, జడ్పీటిసి వెంకటేశ్వరమ్మగోపాల్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల అధికారులు పాల్గొన్నారు.
భీమా కాల్వ ఎక్కి పారడంతో పంట పొలాల్లోకి సాగునీరు
పాన్‌గల్, అక్టోబర్ 22: మండల పరిధిలోని జమ్మాపూర్ గ్రామ సమీపంలోని భీమా కాల్వపై నుండి నీరు ఎక్కి పారడంతో గ్రామానికి చెందిన మురళీధర్‌గౌడ్ పొలం వద్ద కాల్వ సాగునీరు పంటపొలాల్లోకి వృథాగా పోయింది. విషయం తెలుసుకున్న సర్పంచు భాస్కర్‌రెడ్డి, వార్డు సభ్యులు మల్లయ్య, నాయకులు రాజుగౌడ్, సురేష్‌శెట్టిలు కాల్వ దగ్గరకు చేరుకొని విషయాన్ని భీమా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భీమా కాల్వలో సాగునీరు ఉద్ధృతంగా పారడంతో కాల్వకు ఇరువైపుల ఉన్న బ్యాంకింగ్‌పై నుండి నీరు ఎక్కిపారి పంటపొలాల మీదుగా వథాగా పోతోందని వారు తెలిపారు.
ప్రజా సేవలోనే సంతృప్తి
* పిసిసి సభ్యుడు
గద్వాల, అక్టోబర్ 2: ప్రజా సేవలోనే సంతృప్తి ఉన్నదని, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణమ్మ అడుగుజాడలో తాను ముందుకు కొనసాగుతానని పిసిసి సభ్యుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం పిసిసి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా పలువురు పట్టణంలోని టిఎన్‌జిఓ భవన్‌లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఎనికైనా గడ్డం కృష్ణారెడ్డిని ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, ఉద్యోగ, రాజకీయ సంఘాల నాయకులు శాలువ కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గడ్డంకృష్ణారెడ్డి ఎదిగిన వ్యక్తి అని, ఆయన ఎప్పుడు ఏ ఆపద వచ్చిన అందరికి సహాయం చేసే మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. వ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల, రాజకీయ సంఘాల నాయకులు మాలశ్రీనివాస్, జమ్మిచేడు ఆనంద్, అన్వర్, వెంకటేష్, పాల్గొన్నారు.