మహబూబ్‌నగర్

బంగారు తెలంగాణ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను ఆదుకోవాలని తీవ్రకష్టాల్లో ఉన్న రైతులకు రోసా కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాంచందర్ కుంతియా ఆరోపించారు. ఆదివారం జడ్చర్ల నపియోజకవర్గం బాలానగర్ మండల పరిధిలోని గుండేడు, ఉడిత్యాల, నందారం గ్రామాల్లో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలను డిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నందారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రాంచందర్ కుంతియా మాట్లాడుతూ కెసిఆర్ చెప్పే బంగారు తెలంగాణ తనకుగానీ, ప్రజలకు గానీ ఎక్కడ కనిపించడం లేదని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అయితే కెసిఆర్‌ను నమ్మి ఇక్కడి ప్రజానికం ఓట్లు వేస్తే ఆయన మాత్రం పరిపాలన చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం అంటేనే వ్యవసాయంపై ప్రజలు ఆధారపడి ఉండే ప్రాంతమని అలాంటి రాష్ట్రంలో ముందుగా ప్రభుత్వాలు రైతుల సమస్యలపై దృష్టి కేంద్రికరించాలని హితవు పలికారు. ఇటివల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అధిక వర్షాలకు లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అలాంటి సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన బాధ్యతను గుర్తుంచుకుని రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఏ నాయకుడైన, ఏ ప్రభుత్వమైన రైతులను విస్మరించిన నాడు వారు మనుగడ సాధించలేరని, ఇది చరిత్ర చెప్పిందన్నారు. తెలంగాణలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టం అంచనాలను వేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్లలో భాగంగా రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసి ఆర్ మూడున్నర ఏళ్ల పాలనలో ప్రతి వర్గానికి అన్యాయం చేశాడని అందులో ప్రధానంగా రైతు కొలుకోలేనిస్థితిలో అన్యాయం చేశాడని ఆరోపించారు. అందుకే తాను కెసిఆర్‌ను రైతు కంఠక ప్రభుత్వమని ఆరోపిస్తున్నానన్నారు. రైతు జీవితంలో మూడు అంశాలు ఇమిడి ఉన్నాయని ఒకటి ప్రకృతి, మరోకటి ప్రభుత్వం, ఇంకొకటి మార్కెట్ అన్నారు. మార్కెట్ ప్రకృతిని ప్రభుత్వం అంచనా వేసుకుంటూ రైతుకు సహయపడాలని అలా సహయ పడకుంటే ఆ పాలన లేనట్లేనని, ప్రస్తుతం రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వంలో అదే జరుగుతోందని ఆరోపించారు.