మహబూబ్‌నగర్

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ, నవంబర్ 18: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేశారు. కోత్లాబాద్ గ్రామంలోని రూ.13లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు భవనానికి, మిషన్ భగీరథ ట్యాంక్‌కు భూమి పూజ చేశారు. అనంతరం మల్లాపూర్, బూర్గుపల్లి, ఖాజీపూర్, కన్నాయపల్లి, కేశ్వాపూర్, మనికొండ గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా నిర్మిస్తున్న ఓవర్ హేడ్ ట్యాంకులకు భూమిపూజ నిర్వహించారు. కన్నాయపల్లి గ్రామంలో ఎర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు నిరంతరం అనుభవిస్తున్న కష్టాలను తోలగించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి గ్రామానికి ,ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం తీసుకురావడం జరిగిందన్నారు. కోయిలకొండ మండలంలోని చాలా గ్రామాలకు ఇప్పటికే కృష్ణా జలాలను శుద్ది చేసి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మండలంలో 104 ట్యాంకులు మంజూరీ కావడం జరిగిందని రాబోయే కొద్ది మాసాల్లో నిర్మాణాలు పూర్తి చేసి పూర్తిస్థాయిలో తాగునీరు ఇంటింటికి కోళాయిల ద్వారా అందిస్తామన్నారు. మండలంలోని పెద్ద గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఎర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆ గ్రామాల్లో ఎకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్ను కోవడం ద్వారా గ్రామ ఐక్యత చాటడం గ్రామానికి రూ.10 లక్షలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నారు. మండలంలోని అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని ప్రతీ గ్రామానికి రోడ్డు వసతి కల్పించడం జరిగిందన్నారు. నాయకులు రాజకీయాలు మానుకొని అభివృద్ది చేసే వారికి సహకరిస్తే మండలం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతుందన్నారు. కార్యక్రమంలోఎంపిపి స్వప్న, నవోదయ ఆసుపత్రి చైర్మన్ రవీందర్‌రెడ్డి,జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు రవి, సింగల్‌విండో చైర్మేన్ శ్రీనివాస్‌రెడ్డి,రైతు సంఘం అధ్యక్షులు మల్లయ్య, సర్పంచ్‌లు , ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ నాయకులు కృష్ణయ్య, గోపాల్‌గౌడ్, కరుణాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, పాల్గోన్నారు.
అభివృద్ధికి పెద్దపీట: ఆల
కొత్తకోట, నవంబర్ 18: నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేశామని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోట, మదనాపురం మండలాల్లో షాదిముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యమం సమయంలో కేసీ ఆర్ ఓ తండాకు వెళ్లి కట్నం డబ్బులు ఇవ్వలేక పెళ్లి అర్ధంతరంగా నిలిచిపోయిందని ఇది దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లలకు మేనమామ వలే షాదిముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ఇటీవలే కళ్యాణలక్ష్మికి రూ.75,116లకు పెంచారన్నారు. నియోజకవర్గంలో 2019 ఎన్నికలలోపు అన్ని గ్రామ పంచాయతిలను అభివృద్ధి చేస్తానని, బీటీ రోడ్డు లేని గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేస్తామన్నారు. 300 చెరువులు నింపుకొని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అనంతరం కానాయపల్లి గ్రామంలో 72 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. కొత్తకోట మండలంలోని 46 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మదనాపురం మండలంలో 27 మంది లబ్ధిదారులకు రూ.75,116లు, 18మందికి రూ.51వేలు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మండల కేంద్ర సమీపంలోని మేదర కులస్తుల కుల దేవత అయిన మలలమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రూ.3లక్షలతో ఈ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుంతవౌనిక, మార్కెట్ ఛైర్మన్ రాజేశ్వరమ్మ, సీడీసీ ఛైర్మన్ జగన్, సింగిల్‌విండో ఛైర్మన్ రావుల సురేంద్రనాథ్‌రెడ్డి, సర్పంచులు రాజేశ్వరమ్మ, చెన్నకేశవరెడ్డి, భాగ్యమ్మ, నాయకులు కొండారెడ్డి, భీంరెడ్డి, ప్రశాంత్, కృష్ణయ్య, వామన్‌గౌడ్, బాలకృష్ణ, కటికెశ్రీను, వాసీమ్, మోహన్‌కుమార్, విష్ణు, రవీందర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.