మహబూబ్‌నగర్

కలెక్టరేట్ తరలింపును అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 18: జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తరలించి వేరే చోట నిర్మించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ హెచ్చరించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని జిల్లా కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో కలెక్టరేట్ తరలింపును నిరసిస్తూ అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రేస్, టీడీపీ, సీపీఐ, సీపిఎం, వైకాపా, ముస్లీం లీగ్ పార్టీలతో పాటు వివిధ కులసంఘాల నాయకులు, మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని భూత్పూర్ వైపు తీసుకెళ్లి అక్కడ నిర్మిస్తామని చెబుతుండడం హాస్యాస్పదం అన్నారు. ఉమ్మడిగా ఉన్న జిల్లా విడిపోయాక మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కార్యాలయమే బాగుంటుందని ప్రజలంతా అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం తమ ఆస్తులకు ధరలు పలకడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌పి వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయమే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందని ఒకవేళ సమీకృత భవనం ప్రభుత్వం నిర్మించాలనుకుంటే కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కూడా దాదాపు 15 ఎకరాల భూమి ఉందని దీనిని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు కలెక్టరేట్‌ను తరలించేందుకు కుట్రలు జరుపుకున్నారని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు మాట్లాడుతూ ప్రజా ఉద్యమం చేపడుతామని ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేసి కలెక్టరేట్ తరలింపును అడ్డుకుందామని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయాన్ని తరలిస్తే ప్రజలు తిరగబడాలని అందుకు సీపీఐ ప్రజా చైతన్య యాత్రను చేపడుతుందని జిల్లా కేంద్రంలో ఇంటింటికి వెళ్లి ప్రజా ఉద్యమానికి సన్నద్దం చేస్తామని వెల్లడించారు. వైకాపా జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ మాట్లాడుతూ ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చాలి కానీ మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయాన్ని వేరే చోటికి తరలించి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని హితవు పలికారు. జిల్లాలు ఏర్పడినందున ప్రస్తుతం ఉన్న కార్యాలయం పరిపాలనకు అనువుగానే ఉందని ఆమె పెర్కోన్నారు. జేఎసి జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాయకులు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అఖిలపక్షం నాయకులంతా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ఈ ఉద్యమంలో విద్యార్థులను, మహిళలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ముస్లీం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుద్‌బుద్‌బేగ్, నాయకులు లక్ష్మణ్‌యాదవ్, కట్టరవికిషన్‌రెడ్డి, అనంతారెడ్డి, మంత్రి నరసింహ, కురుమయ్య, వినోద్‌కుమార్, బ్రహ్మయ్య, సురేష్ పాల్గొన్నారు.