మహబూబ్‌నగర్

ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, నవంబర్ 19: వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతామహంతి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుండి వచ్చిన 60 పర్వతారోహకులతో కలిసి ఖిల్లాగణపురం ఖిల్లాను ఆమె అధిరోహించారు. గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ, గద్వాల ఎస్పీ విజయ్‌కుమార్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఖిల్లాను అధిరోహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శే్వతామహంతి మాట్లాడుతూ 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజులు నిర్మించిన కోట, తటాకాలు, ఫిరంగి, కోట గోడలు, రక్షణ కట్టడాలు, ఏడాది పాటు నీరుండే ఊట చెలిమెలు ఇలా చుడాదగ్గ ప్రదేశాలో ఖిల్లా గట్టుపై ఉన్నాయని తెలిపారు. పర్యాటకులు వీటిని తిలకించేందుకుగాను అనువైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ప్రతి రోజు ముఖ్యంగా ఆదివారం, సెలవు రోజుల్లో ఆనేక మంది ఖిల్లాగణపురం కోటాను సందర్శిస్తున్నారని ఆమె తెలిపారు. కనీసం 20 మందితో కూడిన బృందం ముందుకు వస్తే ప్రభుత్వం తరపున సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న పర్వాతారోహులకు సెలవు దినాల్లో సరదాగా గడిపే వారికి ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. కలెక్టర్‌తో పాటు ఎంపీపీ కృష్ణనాయక్, డీఎఫ్‌ఓ ప్రకాష్, డీఆర్‌డీఓ గణేష్, డీపీఓ వీరబుచ్చయ్య, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ చంద్రయ్య, తహశీల్దార్ హీరాలాల్, ఎంపీడీ ఓ రెడాయ్య, సర్పంచు తదితరులు పాల్గొన్నారు.