మహబూబ్‌నగర్

వాసవి సేవలు స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, నవంబర్ 19: ప్రపంచ స్థాయిలోనే నీతి నీజాయితిగా సేవలుందిస్తున్న వాసవిక్లబ్ ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమని రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం వెల్దండ చెన్నరెడ్డి గార్డెన్‌లో వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా సద్గురు మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈసందర్బంగా పూర్వపు జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున 122 వాసవి,వనిత క్లబ్ సభ్యులు హాజరైనారు. ఈసందర్బంగా జిల్లా గవర్నర్ జూలురి రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన మహోత్సవంలో మంత్రి జూపల్లితో పాటు ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు నిస్వార్థ్ధంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం అర్యవైశ్యులు వాసవి, వనిత క్లబ్‌ల పేరుతో ఎంత గానో సేవలు అందిస్తు పాటు పడుతున్నారని అన్నారు. జీవించినన్ని రోజుల్లో ఎంత సంపాందించమన్నది ముఖ్యం కాకుండ సామాజికంగా సేవ చేయడమే పరమార్థంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న వాసవి, వనిత క్లబ్‌లు ప్రతి ఓక్కరికి అదర్శప్రాయమని అన్నారు. అర్యవైశ్యులు అదుకునేందకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రిలో మాట్లాడుతానని హమీ నిచ్చారు. ముఖ్యంగా బీద వైశ్యులతో పాటు బీద ప్రజలను అదుకునేందుకు అర్యవైశ్యులు తమ సేవలను పల్లెలకు విస్తరింపజేయాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యంపై దృష్టి కేంద్రికరించాలని సూచించారు. అర్యవైశ్యులకు అంఢగా ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ జీవించినన్ని రోజులు ఎంత సంపాందించమన్నది కాకుండ ఎంత సేవ చేసామన్నాది చూసుకోవాలని అన్నారు. జీవించినన్ని రోజులు చేసిన సేవలు తర తరాలకు గుర్తిండి పోతాయని, సామాజిక సేవలో ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు. సేవకు ప్రతి రూపంగా అర్యవైశ్యులు ముందుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఏ దేశంలో చూసిన అర్యశైశ్యులు సేవ కార్యక్రమల్లో పాలు పంచుకుటున్నారని గుర్తు చేశారు. వాసవి, వనిత క్లబ్‌లు సేవ చేయడమే పరమార్థంగా భావించి ఎన్నో సహయ సేవ కార్యక్రమాలు అర్యవైశ్యులకే కాకుండ ఇతర కులస్థులకు సైతం అందే విధంగా చూస్తున్నారని, వారి సేవలు శ్లాఘనీయమని కొనియాడారు. సేవా గుణంలో అర్యవైశ్యులకు సాటి ఎవ్వరు రారని ఆయన స్పష్టం చేసారు. అనంతరం జిల్లా వాసవి క్లబ్ గవర్నర్‌గా విశేష సేవలందించిన జూలురి రమేష్‌బాబు, రాజేశ్వరి దంపతులను వాసవి, వనిత క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అదే విధంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ కార్యదర్శిశ్రీనివాస్‌రావు, రాష్ట్ర, జిల్లా బాద్యులు జనార్ధన్, రఘు, విట్టదురయ్య, రవీంద్రనాథ్, నాగేశ్వర్‌రావు, కిశోర్, హకీంరాజేష్, రామేశ్వర్, నాగేష్, శివప్రసాద్, బచ్చురామకృష్ణ, లక్ష్మన్, అశోక్, శ్రావన్‌కుమార్, పాండురంగయ్య, మదుమోహన్, కల్వశ్రీనివాస్, రాజయ్య, రమేష్ , టిఅర్‌ఎస్ నాయకులు భూపతిరెడ్డి, అనంద్‌కుమార్, సూర్యప్రకాష్‌రావు, తదితరులు పాల్గొన్నారు

ఏకపక్ష రాజకీయ విధానం టిఆర్‌ఎస్‌తోనే..
* ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
అయిజ, నవంబర్ 19: ఏకపక్ష రాజకీయ విధానం టిఆర్‌ఎస్‌తో సాధ్యమని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అయిజ పట్టణంలో ఎంబిఆర్ ఫంక్షన్ హాల్ నందు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడికొండ లక్ష్మికాంతారావు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు జానయ్య, మాజీ జడ్పీటిసి లేపాక్షి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జనార్దన్‌గౌడుతో పాటు వేలాది మంది కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. లక్ష్మికాంతారావు, జానయ్యలను గజమాలలతో సత్కరించి టిఆర్‌ఎస్ పార్టీలోకి నిరంజన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడిగడ్డ వాసులు నమ్మిన మాటకు విలువ ఇస్తారని, మాట ఇస్తే ప్రాణాలిచ్చే రకమని అన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు జోహార్లు, కెసిఆర్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు. 2001న పార్టీ ప్రారంభం అయినప్పటి నుండి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని, తెలంగాణ ఆత్మకు ప్రతిరూపాలే ప్రజలు, కార్యకర్తలని అన్నారు. తెలంగాణ జాని అంతా ఒకటేనని, ప్రధానమంత్రి మోదీతో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కెసిఆర్ పాలనను మెచ్చుకున్నారని అన్నారు. ప్రజల సహకారంతో ఏకపక్ష రాజకీయ విధానం ఏర్పడుతుందని అన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి బింగిదొడ్డి రిజర్వాయర్ ఏర్పాటుకు త్వరలో పనులు ప్రారంభం అవుతాయని, తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని, ఆర్డీఎస్ ఆయకట్టుకు జీవం పోస్తామని నిరంజన్‌రెడ్డి అన్నారు. కిడ్నీవ్యాధి గ్రస్తులకు గద్వాలలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు అవుతుందన్నారు.
కార్యకర్తలే పట్టుగొమ్మలు : మాజీ ఎంపి
పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని మాజీ ఎంపి మంద జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆదరించే వారికి ఆహ్వానం ఎల్లప్పుడు ఉంటుందని, మా వెంట నడిచే వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మికాంతరావు, జానయ్యలు మాట్లాడుతూ సభను విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మా వెంట మీరు ఉంటే, మీ వెంట మేముంటామని, అన్ని వేళలా అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్,నియోజకవర్గ ఇన్‌చార్జి మంద శ్రీనాథ్, మార్కెట్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీలు చంద్రావతి, శ్యామల, వైస్ చైర్మన్ నాగన్‌గౌడ్, గట్టు తిమ్మప్ప, వడ్డేపల్లి శ్రీనివాసులు, ఆర్.శ్రీ్ధర్, చిన్న హన్మంతు తదితరులు పాల్గొన్నారు.