మహబూబ్‌నగర్

విద్యుదాఘాతంతో టిప్పర్ దగ్ధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, నవంబర్ 21: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో మట్టిని తరలిస్తున్న టిప్పర్‌కు విద్యుత్‌ఘాతం తగలడంతో బోయ రవి(30) అనే కార్మికుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. భూత్పూరు మండలం కర్వెనా రిజర్వాయర్ వద్ద పాలమూరు ఎత్తిపోతల పథకంలో టిప్పర్‌లో మట్టిని తరలిస్తుండగా రోడ్డుపై విద్యుత్ తీగలు తగలడంతో టిప్పర్ బుడిదైంది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మరమ్మత్తులకు నోచుకోని...
కోయిల్‌సాగర్ కాల్వలు
* 25న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల
* జిల్లా అదేశాలు బేఖాతర్ చేసిన అధికారులు
ధన్వాడ, నవంబర్ 21: మరికల్ మండలంలోని వివిధ గ్రామంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు సంబందించిన కల్వలు నేటికి మరమ్మత్తులు నోచుకోవడం లేదు. కాల్వలలో పిచ్చికంప మొక్కలు మొలిశాయి. మరోచోట కాల్వలకు గండ్లు పడ్డాయి. అయిన నేటికి కాల్వలను, గండ్లను మరమ్మత్తులు చేసిన దాఖలాలు కనబడుటలేదని మరికల్ మండల రైతులు వాపోతున్నారు. ఇట్టి విషయంపై స్వయంగా జిల్లా కలెక్టర్ కాల్వలను పరిశీలించడం జరిగిన నేటికి పనులు చేయడంలేదు. ఈనెల 25న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా రబీపంటకు సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వ అదేశాలు ఉన్నాయి. కాని నేటికి కాల్వల మరమ్మత్తులు జరగడంలేదు. ఇకనైన కోయిల్‌సాగర్ కాల్వల మరమ్మత్తుపనులు వేంటనే చేపట్టి కోయిల్‌సాగర్ అయాకట్టు కింద ఉన్న రైతులకు సాగురు అందేలా చూడాలని మరికల్ మండల రైతులు కోరుతున్నారు.