మహబూబ్‌నగర్

దేశ భవిష్యత్, అభివృద్ధి యువతపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 21: దేశ భవిష్యత్, అభివృద్ధి యువతపైనే ఆధారపడి ఉందని జిల్లా కలెక్టర్ ఇ. శ్రీ్ధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుతున్న సాంఘీక దురాచారాలను నిర్మూలించేందుకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకు భారతదేశమంటే భయమని, దానికి కారణం యువత ఎక్కువగా ఉండటమేనని అన్నారు. ప్రశ్నించడంతోపాటు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను కూడా గుర్తించుకోవాలన్నారు. శాస్త్ర సంకేతిక రంగాలలో ముందుకు దూసుకొని పోతున్న రోజులలో కూడా దేశంలో బాల్య వివాహాలు, బాల కార్మికులు, మూఢనమ్మకాలు ఉన్నాయని, వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. ఇందుకుకోసం ప్రజలను చైతన్యపర్చాలని, నిరక్షరాస్యతను నిర్మూలించాలన్నారు.బహిరంగ మల విసర్జనను నివారించేందుకు ప్రతి కుటుంబం మరుగుదొడ్డిని నిర్మించుకునేంకునేలా అవగాహన పర్చాలన్నారు. ఈసందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రజ్వల, డిపిఆర్వో రామ్మోహన్‌రావు, యూనిసెఫ్ ప్రతినిధి ప్రసూన్ సేన్, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సలీమ్, లక్ష్మణ్‌రావు, గోవర్దిని, పాల్‌రాజు పాల్గొన్నారు.