మహబూబ్‌నగర్

లైంగిక దాడుల నిరోధానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 21: బాలబాలికలపై లైంగిక దాడులు అరికట్టవలసిని బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ ఉద్భోదించారు. మంగళవారం స్థానిక బాలభవన్‌లో బాలలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోలీస్ యంత్రాంగం ద్వారా జాగో-బద్లో-్భలో అనే ఒక రోజు వర్క్‌షాపును నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో పిల్లలపై లైంగిక దాడులు ఏవిధంగా జరుగుతున్నాయి, వాటిని ఏవిధంగా అరికట్టాలి అనే అంశాలను ప్రొజెక్టర్ ద్వారా చిత్రపదర్శన రూపంలో ప్రదర్శించారు. వర్క్‌షాపులో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో బాలబాలికలకు సురక్షితంగా జీవించే హక్కు ఉందని, బాలలపై జరిగే లైంగిక వేధింపుల గురించి చర్చించుకునే వారికి మేము ఉన్నామని దైర్యాని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లైంగిక అంశాలపై పిల్లలతో వారి తల్లిదండ్రులు చర్చించాలని వారితో ప్రేమ పూర్వకంగా ఒక స్నేహితులవల్లే ఉన్నపుడే వారికి జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులతో చెప్తారనీ అన్నారు. పిల్లల్లో అవగాహాన లేకుండా వారు ఒంటరి వారిగా అయితే వారిపై లైంగిక దాడి జరిగినపుడు ఎవరితోనూ చెప్పుకోలేక లోలోపల మదనపడుతూ వారి జీవితం నాశనం చేసుకుంటారని హెచ్చరించారు. అందుకే బాలలను లైంగిక దాడి నుండి రక్షించుటలో ఇటు తల్లిదండ్రులు అటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమానంగా బాధ్యత తీసుకోవలసి వుంటుందన్నారు. ఈ లైంగిక దాడులను అరికట్టి బాలలను సురక్షితంగా ఉంచేందుకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిని విశదీకరించారు. జిల్లా అడిషినల్ ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ పోస్కో యాక్ట్‌పై వివరించారు. 18 సంవత్సరాలలోపు బాలలపై జరిగే లైంగిక దాడులు ఏవిధంగా ఉంటాయి వాటి నుండి ఈ యాక్ట్ ద్వార పిల్లలకు ఎలా రక్షణ ఉంటుందనే అంశాలు కూలంకషంగా వివరించారు. ఈ వర్క్‌షాపులో పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాత్ర, వారు ఏ విధంగా ఉండాలి అనే అంశంపై డిఇఓ వేణుగోపాల్ వివరించారు. డిపిఆర్‌ఓ సీతారామ్ మాట్లాడుతూ బాలలపై లైంగిక దాడి అరికట్టడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని, బాలలు, వారి తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయన్ని మీడియా ముందుకు తెస్తే ఎంతటివారైనా శిక్ష నుండి తప్పించుకోకుండా మీడియా చూస్తుందన్నారు. అనంతరం బాలభవన్ నుండి ర్యాలీ తీస్తూ రాజీవ్‌మార్గ్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమలో జిల్లా సంక్షేమశాఖ అధికారి అరుణ, ఎంవి పౌండేషన్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆటోడ్రైవర్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
వాసవి డిప్యూటీ గవర్నర్‌కు అవార్డు
* సేవా కార్యక్రమాలకు గుర్తింపు
నాగర్‌కర్నూల్, నవంబర్ 21: ఈ యేడాది వాసవిక్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ రీజియన్ పరిధిలో చేపట్టిన సేవా కార్యక్రమాల గుర్తించి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారు క్లబ్ డిప్యూటీ గవర్నర్ కొట్ర బాలాజీకి సూపర్ బెస్ట్ డిప్యూటీ గవర్నర్ అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా వాసవిక్లబ్ డిప్యూటీ గవర్నర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో 13 క్లబ్‌లను తనకు కేటాయించగా, ఈ యేడాది 19 కొత్త క్లబ్‌లను, 677 మంది సభ్యులకుగాను 1599 సభ్యులకు పెంచడం జరిగిందని, ఇందులో 922 మంది కొత్త సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 620 మంది కెసిజిఎఫ్ సభ్యులున్నట్లు తెలిపారు. రీజియన్ పరిధిలో ఈ యేడాది రూ.40లక్షలతో వివిధ సేవా కార్యక్రమాలను చేయడం జరిగిందని, 12చోట్ల మహాత్మాగాంధీ విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందన్నారు. వనితావైభవం కార్యక్రమంలో భాగంగా 300 మందికి, రక్తదాన శిబిరాలను నిర్వహించి 500 యూనిట్లను రక్తాన్ని సేకరించడం జరిగిందని, 10 చోట్ల స్వాగత బోర్డులు, 10 వాటర్ ట్యాంకులను బహుకరించడం, మూడు పాఠశాలలకు కలర్ టివిలతోపాటు విద్యార్థులకు నోటుపుస్తకాలు, స్పోర్ట్స్ కిట్స్ తదితర వాటిని ఇవ్వడంతో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారు గుర్తించి సూపర్ బెస్ట్ డిప్యూటీ గవర్నర్ అవార్డును డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రామేష్‌బాబు, ఇంటర్నేషనల్ డైరక్టర్ హకీం రాజేశ్‌లు అందచేసినట్లు తెలిపారు. ఈ అవార్డుతో తనపై బాధ్యతలు పెరిగాయని, ఇదే స్పూర్తితో రాబోయే రోజులలో మరికొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కొట్ర బాలాజీకి అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.