మహబూబ్‌నగర్

రాష్ట్రానికే ‘మయూరీ’ తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 21: రాష్ట్రంలోనే హరితవనం మయూరీ నర్సరీని ఏకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు వెల్లడించారు. మంగళవారం ఉదయం మయూరీ నర్సరీలో పర్యటించారు. అదేవిధంగా సాయంత్రం చిల్డ్రన్స్ ప్లేస్, అడ్వైంచర్‌జోన్‌ను కూడా ప్రారంబించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మయూరీ నర్సరీలో గడిపిన కలెక్టర్, ఎమ్మెల్యేలు మయూరీ నర్సరీలోని గుట్టలు ఎక్కి అడవి అందాలను తిలకించారు. దాదాపు 1000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న హరితవనం మయూరీ పార్కును తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సూచించారు. ఇదివరకే ప్రారంభం అయిన పనులను కూడా వారు పరిశీలించారు. దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వాకింగ్ ట్య్రాక్‌పై నడుస్తూ పనులను పరిశీలించి హరితవనంలోని వాతావరణాన్ని ఆస్వాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ హరితవనం మయూరీ పార్కు రాష్ట్రంలోనే అతిపెద్ద పార్కుగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఇక్కడికి పెద్ద ఎత్తున పర్యటకులు వచ్చేలా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే దాదాపు రూ.3కోట్లకు ప్రతిపాదనలు పెట్టి దాదాపు కోటి రుపాయలు ఖర్చు చేసి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. పార్కును చూసేందుకు వచ్చిన వారు మళ్లి మళ్లి పార్కుకు వచ్చేవిధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇటు మహబూబ్‌నగర్, అటు జడ్చర్ల పట్టణాల సమీపంలో ఈ పార్కు ఉండడంతో ఇప్పటికే ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను తీలకిస్తూ సేదతీరుతున్నారన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాకే హరితవనం పార్కు ఓ పెద్ద అడ్వైంచర్ అని దింతో జిల్లా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి రానుందన్నారు. మహబూబ్‌నగర్ అంటే వలసలు తప్పా. వేరే మాటనే ఉండేది కాదని భవిష్యత్తులో పాలమూరులో అన్ని ఉన్నాయనే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మయూరీ పార్కుకు కూతవేటుదూరంలోనే బైపాస్‌రోడ్డు పనులు జరుగుతున్నాయని అదేవిధంగా ఐటీ పారిశ్రామిక కారిడార్ కూడా పార్కుకు రెండుమూడు కిలోమీటర్ల దూరంలోనే రాబోతున్నాయని దాంతో హరితవనం పార్కు మరింత ప్రచారంలోకి రానుందన్నారు. ఇప్పటికే ప్రజల తాకిడి పెరిగిందని తెలిపారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికి అన్ని విధాల ఆటవస్తువులతో పాటు ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.