మహబూబ్‌నగర్

విద్యాసంస్థలపై పోలీస్ విచారణ తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 19: విద్యా సంస్థలలో ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు దుర్వినియోగమవుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం పోలీస్‌లతోను, విజిలెన్స్ అధికారులతోను విద్యా సంస్థలలో విచారణ జరిపించడం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విద్యా సంస్థలపై పోలీసులతో విచారణ జరిపించాలని నిర్ణయించడం సబబుగా లేదని, పోలీస్‌శాఖలో కూడా అవినీతి విలయతాండవం చేస్తుందని, ఇటీవల ఓ సంఘటనలో పోలీస్ సిఐపైఅనేక కేసులు నమోదైన సంఘటన జరిగిందన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలోను, విద్యా సంస్థలలో పని చేస్తున్న అధ్యాపకుల విషయంలోను, వౌళిక సదుపాయల విషయంలో ప్రభుత్వానికి ఏవైనా అనుమానాలు ఉంటే విద్యాశాఖలో పర్యవేక్షణాధికారులు అనేక మంది ఉన్నారని, వారి ద్వారా విచారణ జరిపించి ఎక్కడైనా తప్పులు జరిగినట్లు తేలితే అట్టి కళాశాలలపై పోలీస్ చర్యలు, కేసులు తీసుకుంటే ఎవ్వరికి అభ్యంతరం ఉండదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, విద్యా సంస్థలలో నిధుల దుర్వినియోగం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తే శాసనసభలోదీనిపై చర్చించాలని, అఖిలపక్షం సమావేశంను ఏర్పాటు చేసి వివరించాలని, శే్వతపత్రం ద్వారా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా విద్యాసంస్థలపై పోలీస్‌లతో విచారణ జరిపిస్తామని చెప్పడం సరికాదన్నారు. విద్యా సంస్థలలో జరిగే వివిధ పరీక్షలను జరపనివ్వబోమలని విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రకటించాయని, దీనితో విద్యాసంస్థలకు, ప్రభుత్వానికి మధ్య యుద్దవాతావరణం నెలకొని విద్యార్థులకు అన్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలలో భయాందోళనలు కలగించేరీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వానికి తగదన్నారు. విద్యాప్రమాణాలను పెంపొందించాలనే చిత్తశుద్ద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లైతే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.