మహబూబ్‌నగర్

గద్వాల కవులకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, డిసెంబర్ 10: ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహాక సమావేశంలో భాగంగా ఆదివారం గద్వాల గ్రంథాలయంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బీఎస్ కేశవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లాలోని వివిధ కవులను, కళాకారులను కవి సమ్మేళనంలో ఘనంగా సత్కరించారు. సురవరం ప్రతాప్‌రెడ్డి మహానీయుడు పుట్టిన గడ్డ, జోగుళాంబ పునర్నిర్మిత దేవాలయానికి కళావైభవం తెచ్చిన కడియారం రామకృష్ణ చిత్రపటాలకు అంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సోమనాద్రి కోట వైభవం, కవులకు ఉన్న అవశ్యత గురించి విశ్రాంత తెలుగు పండితులు రామన్‌గౌడ్ పద్యరూపంలో విన్పించారు. విశ్రాంత అధ్యాపకులు హుస్సేన్ తెలంగాణ కవులకు జరిగిన అన్యాయాన్ని పద్యరూపంలో విమర్శించారు. గద్వాల కవులకు ప్రపంచతెలుగు మహాసభలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్‌ను కవి వెంకట్రామయ్యశెట్టి కోరారు. కవి సమ్మేళనానికి కవులు మహేందర్, జయన్న, అంబటి భాను ప్రకాష్ తన పద్యాలతో ఆకట్టుకున్నారు. ఈ సమావేశానికి గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆత్మలింగారెడ్డి, మున్సిపల్ టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ మహిమూద్, గ్రంథాలయ అధికారి సుధాకర్, రామాంజనేయులు, నాయకులు భగీరథ వంశీ, బాలగోపాల్‌రెడ్డి, నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- జాతీయ స్థాయి కరాటే పోటీల్లో-
కేజిబివి విద్యార్థులకు బంగారు పతకాలు
కొత్తకోట, డిసెంబర్ 10: రంగారెడ్డి జిల్లాలోని నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీల్లో కేజిబివి విద్యార్థులు బంగారు పతకాలు సాధించినట్లు క్లబ్‌ఫౌండర్ ఎస్‌కె నబీ, ప్రత్యేకాధికారి శిరిష తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ పట్టణంలో బేగంగార్డెన్‌లో మూడవ షేక్ ఆదామ్ సాహెబ్ స్మారక జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ చాంఫియన్ పోటీలు నిర్వంచారు. ఈ పోటీల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విధ్యార్థినీలు పాల్గొని ప్రతిభను చాటారు. అండర్ -11 విభాగంలో కటాస్‌లోని అరుణ వెండి పతకం, అనిత బంగారు పతకం, అండర్-14 కటాస్ విభాగంలో రజిత, నవ్య బంగారు పతకాలు సాధించగా, మాధవి వెండి పతకాలు సాధించినట్లు వారు తెలిపారు. పతకాలను సాధించిన విద్యార్థులను మాస్టర్ పరమేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. అలాగే ఢిల్లీ ఒలంపడ్ విద్యార్థులు ప్రతిభాను కరాటే పోటీల్లో పతకాలు సాధించగా, వారికి ఎంపీపీ గుంతవౌనిక బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా అద్యక్షులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ మోహన, తదితరులు పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ అవార్డును అందుకున్న వనపర్తివాసి
వనపర్తి, డిసెంబర్ 10: జాతీయ దళిత సాహిత్య అకాడమి 33వ సభలు ఢిల్లీలో జరగగా అందులో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చుక్కరాజు జాతీయ మహాత్మజ్యోతిరావుపూలే అవార్డును అకాడమి చైర్మన్ సమంకర్ చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం చుక్కరాజు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం తనకేంతో ఆనందంగా వుందని, మరింత బాధ్యతను పెంచిందన్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా బహుజన ప్రజల పక్షన వారి అభివృద్ది కోసం కృషి చేయడం, ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా బావించి వారిని చైతన్యం చేస్తూ బహుజన సమస్యల కోసం కృషి చేస్తానన్నారు. ఈ అవార్డు రావడం కోసం కృషి చేసిన చుక్కమోహన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.