మహబూబ్‌నగర్

పోలీసుల అదుపులో రాజేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 14: భర్తను చంపి, ప్రియుడు మొహంపై పెట్రోల్‌పోసి కాల్చి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలో తీసుకొని రావాలనే పథకం వికటించి పోలీసులకు చిక్కిన స్వాతి కేసులో ఆమె ప్రియుడు రాజేష్‌ను పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత నెల 27 ఉదయం స్వాతి భర్త సుధాకర్‌రెడ్డిని ఆమె ప్రియుడు రాజేష్‌తో కలిసి చంపేసిన ఘటన పాఠకులకు విదితమే. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను గురువారం ప్రత్యేక పోలీస్ బలగాలు అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ వద్ద గుమికూడారు. మీడియా కళ్లుగప్పి రాజేష్ మొహానికి ముసుగుకప్పి పోలీసులు వెళ్లగా, మీడియా ప్రతినిధులు లోపలికి వెల్లకుండా పోలీస్ స్టేషన్ ప్రధాన గేట్‌ను మూయడంతోపాటు, అన్ని గేట్ల వద్ద పోలీసులను కాపలాగా పెట్టి లోపలికి ఎవ్వరిని వెల్లకుండా చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ వద్దనే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పోలీస్ స్టేషన్ బయటే ఉన్నారు. ఇది ఇలా ఉండగా రాజేష్‌ను జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగెనెవర్ సమక్షంలో ప్రత్యేక పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. రాజేష్ ఇచ్చిన సమాచారంకు అనుగుణంగా క్లూస్ టీం నాగర్‌కర్నూల్‌లోని స్వాతి ఇంటిని ఆధారాలకోసం ప్రత్యేకంగా మూడు గంటల పాటు తనిఖీలను నిర్వహించి కొన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ఈ కేసును ముందునుంచి విచారిస్తున్న ప్రత్యేక పోలీస్ అధికారులు రాజేష్‌ను స్వాతి ఇంటికి తీసుకొని వెళ్లి విచారించారు. మొత్తంమీద ఇటు పోలీస్ స్టేషన్ వద్ద, అటు స్వాతి ఇంటి వద్ద హడావిడి కనిపించింది. సాయంత్రం వరకు పోలీస్ అధికారులు ఏదైనా సమాచారం ఇస్తారని భావించగా, శుక్రవారం ఉదయం ఈ కేసుపై విలేఖరుల సమావేశంలో ఎస్పీ పూర్తి వివరాలను అందజేస్తారని పోలీస్ వర్గాల సమాచారం అందించారు.