మహబూబ్‌నగర్

దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, డిసెంబర్ 14: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కుల మతాలకు అతీతంగా పేద, ధనిక విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల పరిధిలోని తాండ్ర గ్రామంలో 13 లక్షల రూపాయాలతో నూతనంగా నిర్మించబోయే గ్రామ పంచాయతీ భవనం, 23 లక్షల వ్యయంతో నిర్మించే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, 5 లక్షలతో పాఠశాల ప్రహారి గోడ నిర్మాణానికి భూమిపూజ చేశారు.అనంతరం తిమ్మరాసిపల్లి గ్రామంలో పాలశీతలికరణ యంత్రాన్ని, మార్చల, యంగంపల్లి గ్రామాలలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. మొదటగా తాండ్ర గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాం వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేశారు. అదేవిధంగా కల్వకుర్తి, వెల్దండ మండలాల కల్యాణలక్ష్మి, షాదిముబారక్ లబ్ధిదారులకు కల్వకుర్తి తహాశీల్దార్ కార్యాలయం వద్ద చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు చరిత్రలో నిలుస్తాయన్నారు. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకే అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాలలోనే రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టుదలతో పూర్తి చేస్తు రైతుల ముఖంలో ఆనందాన్ని నింపిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుంతుందన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీర్ పాలన కొనసాగుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరును అందించడంతో పాటు జనవరి 1వ తేదీ నుండి 24 గంటల విద్యుత్‌ను అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ప్రత్యేక గుర్తింపును తెలంగాణ రాష్ట్రం పొందుతున్న ప్రతిపక్ష నాయకులు మాత్రం అభివృద్ధిని ఎలాగైన అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. అదేవిధంగా పట్టణ కేంద్రంలో టీఆర్‌ఎస్ మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాలాజీసింగ్ నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజల కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తాండ్ర గ్రామంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అర్డీఓ రాజేష్‌కుమార్, డిఎస్పీ ఎల్‌సి నాయక్, తహాశీల్దార్ మంజుల, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ విజితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, వెల్దండ జడ్పీటిసి వెంకటమ్మ, నగర పంచాయతీ చైర్మన్ శ్రీశైలం, తాండ్ర సర్పంచ్ గోలి కమలమ్మ, జడ్పీటిసి అశోక్‌రెడ్డి, ఎంపిపి రామేశ్వరమ్మ, వైస్ ఎంపిపి పర్వతాలుగౌడ్, యంగంపల్లి, మార్చల సర్పంచ్‌లు సత్యం, కృష్ణయ్య, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఆనంద్‌కుమార్, సురేందర్‌రెడ్డి, శ్రీను, భూపతిరెడ్డి, సూర్య ప్రకాష్‌రావు, మక్బుల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.