మహబూబ్‌నగర్

ప్రజల చిరకాల కోరికని పూర్తిచేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినేపల్లి, డిసెంబర్ 17:ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన ఎంజికెఎల్‌ఐని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, జల విజయ పాదయాత్రకు ప్రజలనుంచి అపూర్వ స్పందన వస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఐదోరోజు కారుకొండలో పాదయాత్రను ప్రారంభించే ముందు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం నాటికి వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తియిందని, ఈ వంద కిలోమీటర్లమేర ఎన్నో గ్రామాలను సందర్శించడం జరిగిందని, రైతుల కళ్లలో ఆనందం కనబడుతుందన్నారు. ఈ ప్రాంతంలో వర్షాకాలంలోనే చెరువులు నిండే పరిస్థితిలేకుండేదని, అలాంటిది గతేడాది నుంచి యాసంగిలో చెరువులను నింపడం వల్ల వరిసాగు, కాలువల ఇరువైపుల వేరుశనగ పంటలను వేసుకొని రైతులు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి రిజర్వాయర్లు లేవని, నియోజకవర్గంలోని పెద్ద చెరువులను గుర్తించి రిజర్వాయర్లుగా మారుస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 2014-15 బడ్జేట్‌లోనే 650 కోట్లు, ఆతరువాత వెయ్యి కోట్లు కేటాయించి కేసీఆర్, హరీష్‌రావు, జిల్లా మంత్రులు తాను ఎంతో శ్రద్ధ తీసుకుంటేగాని ప్రాజెక్టు పూర్తికాలేదని, అయినా అసంపూర్తి పనుల వల్ల అక్కడక్కడ సమస్యలున్నాయని, వాటిని తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర ముగిసిన తరువాత ఇరిగేషన్ అధికారులతో కలిసి హరీష్‌రావు సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కారుకొండలో జరిగిన సభలో మాట్లాడుతూ సంక్రాంతిలోగా రైతులకు పరిహారం డబ్బులు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గుడ్లనర్వ గ్రామానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. పాదయాత్రకు ముందు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి చిలకల భజన చేస్తూ నృత్యం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, బైకాని శ్రీనివాస్‌యాదవ్, ఈశ్వర్‌రెడ్డి, గంగనమోని కుర్మయ్య, తిరుపతయ్య, వెంకట్రాంరెడ్డి, శివయ్యయాదవ్,మహమూద్‌ఖాన్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అండగా కాంగ్రెస్
* ఎమ్మెల్యే చల్లా
వెల్దండ, డిసెంబర్ 17: పేద ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యమని, నిరంతరం అండగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. అదివారం చారకొండ మండలం గోకారం గ్రామంలో కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ జెండాలను ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జెండా, అజెండ పేద ప్రజల అభ్యున్నతేనని అన్నారు. తెలంగాణ వాదంతో గద్దెనెక్కిన కేసీఆర్ ఇచ్చిన హమీలను తుంగలో తొక్కి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని అయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడకల ఇండ్ల నిర్మాణాలకు హమీనిచ్చారే తప్పా ఒక్క ఇళ్లు నిర్మించార అని అయన ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడానికి బదులు భూములను లక్కొనేందుకు కుట్ర పన్నుతున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడం మరిచి తన కుటుంబంలోనే కూతురు, కొడుకు, అల్లుడికి ఉద్యోగాలు కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా గిరిజన తెగల మధ్య ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో తగువులు పెడుతూ చిచ్చు పెడుతూ జీవితాలతో చెలగాటం అడుతుందని అయన అవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ నూతన అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రాహూల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సాధిసుందని, ఇందిరమ్మ రాజ్యం తిరిగి రానుందని అయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతిలాల్‌నాయక్, విజయ్‌కుమార్‌రెడ్డి, బాల్‌రామ్‌గౌడ్, పర్వత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి, శేఖర్, హమీద్, బాల్‌రాజ్, మైబు, కృష్ణ. శ్రీనువాస్‌యాదవ్, కొండల్, ఎంపిటిసిలు లక్ష్మమ్మ, నర్సింహ్మరెడ్డి, కడారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.