మహబూబ్‌నగర్

వైభవంగా బీరప్ప దేవర ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, ఏప్రిల్ 20: కుర్వ కులస్థుల అరాధ దైవమైన బీరప్ప దేవర ఉత్సవాల్లో భాగంగ ఊట్కూర్ పట్టణంలో బుధవారం బీరప్ప దేవర ఉత్సవాలను పురస్కరించుకుని ఎల్లమ్మ బండారు (పసుపు) కార్యక్రమం 4వ రోజు ముగింపు సందర్భంగా ఎంతో భక్తి శ్రధ్దలతో వైవంగ నిర్వహించారు. కుర్వ కులస్థులు బుధవారం ఎల్లమ్మ దేవర ఘట్టం వ్యవసాయ పోలంలో ఎర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరప్ప దేవర ఉత్సవాల్లో బాగంగా వివిధ రాష్ట్రాలకు తరలివేళ్లిన కుర్వ కులస్థులు భారీ ఎత్తున తరలివచ్చి ఎల్లమ్మ జాతర బండారు ఉత్సవాల్లో శరీరంపై పసుపు బంగారు చల్లుకుంటే తమ మంచి జరుగుతుందని నమ్మకముంది. ఊట్కూర్‌లో బారప్ప దేవర ఉత్సవాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం కుర్వ కులస్థుల అచారం. కుర్వ కులస్థులలో పెళ్లిడు వచ్చిన యువకులకు పట్టం కడితే వారికి పేళ్లిలు చేయవచ్చని కుర్వ కులస్థుల బావిస్తారు. అందులో బాగంగ కుర్వ కులస్థులు 4రోజల పాటు బీరప్ప దేవర జాతర ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగ నిర్వహించారు. బీరప్ప దేవర జాతరుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి బీరప్ప, ఎల్లమ్మ బండారును శరిరంపై చల్లుకుని గత 5 సంవత్సరాల నుండి బీరప్ప దేవర కోసం పెంచిన గొర్రెలను, మేకలను నైవేధ్యంగా సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. బీరప్ప దేవర జాతర ఎంతో వైభవంగా ముగిశాయి.