మహబూబ్‌నగర్

బిసిలను విస్మరిస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, డిసెంబర్ 26: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిసిల పట్ల చిన్నచూపు చూస్తూ వారి అభివృద్ధిని విస్మరిస్తే సహించేది లేదని బిసి సబ్‌ప్లాన్ సాధన కమిటి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.దేవేంధర్ హెచ్చరించారు. శనివారం గద్వాల పట్టణంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిసిల సమగ్ర అభివృద్ధికి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ఎన్నికల ముందు ప్రకటించి బిసిల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కెసి ఆర్ ఉద్యమపార్టీ సర్వరోగ నివారణిగా తెలంగాణ సాధించుకుంటే సకల సమస్యలు పరిష్కారం చేస్తామని హామి ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడువక ముందే బిసి ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూయించినట్లు, క్రిమిలేయర్ పద్దతి జిఓ 8 తెచ్చి ఆధాయ పరిమితి రూ.6లక్షలకు కుదించడం దారుణంగా ఉందని విమర్శించారు. సమాజంలో 52 శాతంగా ఉన్న బిసిలకు 26శాతం రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాలను పొందడం లేదన్నారు. కొన్ని ఉద్యోగాలు, ఉద్యోగాల ప్రమోషన్లలో వర్తించక పోవడం వల్ల తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ రూ.17లక్షల కోట్లు కాగా 0.2 నిధులు కేటాయించడం అంటే ఎంత దారుణంగా ఉందో అర్థవౌతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.17లక్షల కోట్ల బడ్జెట్‌లో కేవలం రూ.2,162 కోట్లు మాత్రమే బిసిల అభివృద్ధికి కేటాయించడమంటే కెసిఆర్‌కు బిసిలపై ఎంత ప్రేమ ఉందో అర్థవౌతుందన్నారు. కావున రాష్టవ్య్రాప్తంగా బిసిలంత సమగ్ర అభివృద్ధి కొరకు జనాభా ప్రతిపాధికపై నిధులు కేటాయించాలని, బిసి ఉపప్రణాళిక చట్టం చేయాలని డిమండ్ చేశారు. బిసిల సమగ్ర అభివృద్ధి కొరకు 2016 ఫిబ్రవరి 14న రాష్టర్రాజధానిలో లక్ష మందితో మహాధర్నా కార్యక్రమాన్ని జరుగుతుందని, ఈ కార్యక్రమానికి బిసి ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు, మేధావులు, బిసిలు ప్రతి ఒక్కరు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వివి నర్సింహ, హన్మంతు, ఉప్పేరు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.