మహబూబ్‌నగర్

ప్రజల సౌకర్యార్థం నూతన పంచాయతీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 17: ప్రజల సౌకర్యార్థం కోసం గ్రామప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే వివిధ పథకాలను వాటి ఫలితాలు ఎప్పటికప్పుడు అందాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశంలో ఏర్పాటు చేసిన ఎంపీడీఓలు, ఈఓఆర్‌డిలు, పంచాయతీ కార్యదర్శిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ 500 మందికి ఎక్కువగా ఉన్న హబిటేషన్ తండాలు, ఎక్కువ దూరం ఉన్న తండాలను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నూతనంగా ఏర్పాటు కాబడే గ్రామపంచాయతీ మధ్యన ఉండే తండాను గ్రామపంచాయతీగా చేయాలన్నారు. ఎక్కువ జనాభా ఉన్న తండావారి పేరు గ్రామపంచాయతీకి పెట్టాలని సూచించారు. నూతనంగా గ్రామపంచాయతీలకు మ్యాప్‌లు తయారు చేయాలని ఆదేశించారు. అలాగే హద్దులు గుర్తించాలని సర్వే నంబర్ల ఆధారంగా నిర్ణయించాలని రెవెన్యూ గ్రామాలను విభజించవద్దన్నారు. సర్వే నంబర్లను ఒకే దగ్గర ఉండేవిధంగా చూడాలని వీఆర్‌ఓలు సర్వే నంబర్ ప్రకారం షెడ్యూల్ తయారు చేయాలని ఏ సర్వేలో ఏ నంబర్ వస్తుందో నిర్ణయించాలన్నారు. నూతన గ్రామపంచాయతీలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరిలోనే సర్పంచు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉన్నందున వెంటనే నూతన గ్రామపంచాయతీ విధానం, విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తున్నందున ఆ విధంగా అధికారులు నూతన గ్రామపంచాయతీలకు సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ బెన్‌శాలున్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ కొమురయ్య, ఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.