మహబూబ్‌నగర్

నేటి నుంచి జోగుళాంబ వార్షిక బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, జనవరి 17: దక్షిణ కాశీ, అష్టదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగుళాంబ దేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ప్రారంభంకానున్నాయి. స్వస్తిశ్రీ హేవళంబినామ సంవత్సర మాఘ శుద్ద పాడ్యమి నుండి మాఘశుద్ద శుద్ధ పంచమి (శ్రీ పంచమి) వరకు అనగా 18వ తేదీ గురువారం నుండి 22వ తేదీ సోమవారం వరకు శ్రీ జోగుళాంబ అమ్మవారి వార్శిక బ్రహ్మోత్సవాలు కొనసాగిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నరహరి గురురాజ, ధర్మకర్తల మండలి చైర్మన్ తిరుపతి రెడ్డి తెలియజేశారు. గురువారం సాయంకాలం అమ్మవారి సన్నిధిలో ధ్వజారోహణం కార్యక్రమన్ని నిర్వహించారు. ఈనెల 22న శ్రీ జోగుళాంబ దేవి అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చి పూజలందుకోనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ జోగుళాంబ అమ్మవారికి సహస్రఘటాభిషేకం గావించి, సాయంకాలం 4గంటలకు శ్రీజోగుళాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామివార్లకు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శాంతి కల్యాణం నిర్వహిస్లున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి వేలాది భక్తులు తరలివస్తారు. అలంపూర్ పట్టణంలోని శ్రీ కన్యాకపరమేశ్వరి ఆలయం నుండి భక్తులు కళశాళతో మేళతాళాల మధ్య పురవీధుల గుండా ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వరకు కొనసాగిస్తారు. భక్తులు తీసుకవచ్చిన కళాశాల నీటితో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో వివిధ దేవతమూర్తుల అలంకరణలో కళాకారులు ప్రత్యేక ఆకర్షణ. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలను ఈఓ నరహరి గురురాజ, ధర్మకర్తల మండలి చైర్మన్ తిరుపతి రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు చేపడుతున్నారు.