మహబూబ్‌నగర్

సీడ్ కంపెనీలతో రైతులు అగ్రిమెంట్ చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, జనవరి 18: కేంద్ర శాస్తవ్రేత్తల బృందం మల్దకల్ మండలం పెద్దపల్లి, బూర్దిపాడు, అమరవాయి గ్రామాల్లో గురువారం పర్యటించింది. ఈసందర్భంగా కేంద్ర శాస్తవ్రేత్తల బృందం నోడల్ ఆఫీసర్, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్తవ్రేత్త డాక్టర్ ఎకె సింగ్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎఎం సింగ్, కాటన్ రిసోర్స్ ఇన్సిస్టూట్, నాగాపూర్ ప్రధాన శాస్తవ్రేత్త శివారెడ్డి, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్తవ్రేత్త ప్రొఫెసర్ ఎస్‌జే రహిమాన్, డాక్టర్లు రాజలక్ష్మి, రాఘవేందర్, శ్రీవాత్సవ, సుదర్శన్, డాక్టర్ ప్రశాంత్‌లు గ్రామాలలోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీడ్‌పత్తి విత్తనోత్పత్తి చేసే ముందు కంపెనీలతో అగ్రిమెంట్ కుదుర్చుకొని విత్తనోత్పత్తి చేయాలని, లేనిపక్షంలో రైతుకు నష్టం జరిగినప్పుడు ఏం పరిహారం చెల్లించడానికి ఆస్కారం ఉండదని వారు రైతులతో చెప్పారు. పత్తి పొలాల్లో ఏయే రకాలు సాగు చేస్తున్నారని శాస్తవ్రేత్తలు అడుగగా, కావేరి, రాశి, అంకూర్, నూజివీడు విత్తనాలు నాటి పత్తి పండిస్తున్నామని తెలిపారు. విత్తనాలు కంపెనీలు ఇస్తున్నారా? లేక ఆర్గనైజర్లు ఇస్తున్నారా? అని వారు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆర్గనైజర్లతో విత్తనాలు తెచ్చుకుంటున్నామని వారు బదులిచ్చారు. గులాబీ పురుగు వల్ల పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని రైతులు వాపోయారు. వ్యవసాయ శాఖాధికారులు సలహా, సూచనల మేరకు పత్తి చేన్లలో గడ్డిమందులు పిచికారీ చేస్తే బాగుంటుందని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ఈ విధానాన్ని అవలంబించకపోవడం వల్ల పురుగులు చేన్లలో పడి పంటకు తీవ్ర నష్టానికి గురి చేసే అవకాశముందన్నారు. రైతుల కోసమే తమ గ్రామాలలోని కేంద్ర బృందం సభ్యులు పర్యటించి నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగిందని, రైతులు కమిషనరేట్ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల కంపెనీలతోనే నష్టపరిహారం ఇప్పించాలని గతంలో అనేక సార్లు ఈ ప్రాంతం రైతులు రావడం జరిగిందన్నారు. సీడ్ పత్తి ఎకరాకు ఎన్ని క్వింటాళ్లు పండిస్తున్నారని, నాన్‌సీడ్‌పత్తి ఎందుకు వేయడం లేదని వారు రైతులను ప్రశ్నించారు. లింగాకర్షణ బుట్టలు వాడడం వల్ల పురుగులు వస్తున్నాయని, వెంటనే వాటిని తొలగిస్తే పంట దిగుబడి వస్తుందన్నారు. గడ్డిమందు అయిన గ్లైఫోసేట్ వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం బూర్దిపాడు గ్రామంలో రైతులతో సమావేశమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గద్వాల జిల్లా బీఏఓ గోవిందునాయక్, ఏడీఏ అశోకవర్ధన్‌రెడ్డి, ఏఓలు శ్రీలత, మల్లారెడ్డి, ఏఈఓలు అశోక్, అనూష, సర్పంచ్ పద్మమ్మ, సీతారామిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌రంగంలో గణనీయమైన మార్పు
* విద్యుత్ కోసం నియోజకవర్గంలో రూ.185 కోట్లు * ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి

బిజినేపల్లి, జనవరి 18: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగితే విద్యుత్ లేక రాష్ట్రం ఆంధకారమవుతుందని సమైక్యాంధ్ర పాలకుల విమర్శలను తిప్పికొట్టి సీఎం కేసీఆర్ మూడున్నర ఏళ్లలోనే విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పు తీసుకొచ్చారని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గంగారంలో 11కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో 19 సబ్ స్టేషన్లు ఉండేవని, ఈ మూడున్నర ఏళ్లకాలంలో 16 సబ్ స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో ఒక విద్యుత్ కోసమే 185 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి ఉండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆరునెలలోనే విద్యుత్ సమస్యను పరిష్కరించారని అన్నారు. వ్యవసాయాన్ని బలోపెతం చేయడానికి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించడంతోపాటు సాగునీరు, సరిపడా ఎరువులు, సాగు పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4వేల ఆర్థిక సహాయం అందిస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎద్దుల రాములు, సింగిల్‌విండో చైర్మన్ మలిశెట్టి వెంకటస్వామి, మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ గంగనమోని కుర్మయ్య, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మహమూద్‌ఖాన్, శ్రీనివాస్‌గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు.