మహబూబ్‌నగర్

పీఆర్సీ అమలుకు ప్రభుత్వం సానూకులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, జనవరి 18: సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తి ఉపాధ్యాయులదని, ఆ వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయ లోకంపైనే ఎంతైనా ఉందని, మీ సమస్యలను తీర్చే బాధ్యత తనదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి చెప్పారు. గురువారం వెల్దండ మండల కేంద్రంలోని ఓగార్డెన్‌లో ప్రోగ్రెసివ్ రికగైజ్డ్ టీచర్సు యూనియన్ జిల్లా కార్యనిర్వహక వర్గ ప్రథమ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌రావు అద్యక్షతన జరిగింది, ఈసందర్భంగా ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యా విధానంపై తల్లిదండ్రుల్లో, ప్రజల్లో, ప్రభుత్వంలో నమ్మకం సన్నగిల్లుతుందని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా విద్యా బోధన చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే రకమైన విద్య విధానాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తుందన్నారు. అందులో ప్రజాప్రతినిధి నుంచి టీచర్లు, ఉద్యోగుల, ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా కట్టడి చేయాలని చూస్తోందన్నారు. విద్యార్థుల సంఖ్య కంటే 10 వేల మంది ఉపాద్యాయులు అదనంగా ఉన్నారని ఇలాంటి పరిస్థితిల్లో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం వేయకపోవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సమాజంలో మేదావి వర్గమైన ఉపాద్యాయులు తమ వృత్తి ధర్మాన్ని తప్పవద్దని హితవు పలికారు. కొంత మంది ఉపాధ్యాయులు అవగాహన లేకుండా మాట్లాడుతూ కొత్త సంఘాల పేరుతో విద్య వ్యవస్థకు కళంకం తెస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై 400 నుంచి 500 కోట్ల భారంపడినా భరించి 9 నెలలకు సంబంధించిన పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరం తెల్పిందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే విద్యాశాఖ మంత్రులను, ఉన్నత అధికారులను కలవడం జరిగిందని గుర్తు చేశారు. మోడల్‌స్కూల్, కేజీబీవీ విద్యా విధానంపై కేంద్రం చేతులెత్తేసిందని ఆయా విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు రెగ్యూలర్ ఉపాధ్యాయుల తరహాలోనే పథకాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పాడ్డ జిల్లాలో కొంతమంది విద్యాశాఖ అధికారులు అత్సుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారిని కట్టడి చేస్తామని ఆయన హామీనిచ్చారు. అంతక ముందు ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, జిల్లా బాధ్యులు సత్యానారాయణరెడ్డి, సూర్యశ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర అసోషియట్ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, మణిపాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, బిచ్యానాయక్, జంగయ్య, రాజ్యలత,గోవర్ధన్‌యాదవ్, శ్రీనివాసులు, జగన్, శ్రీరాములు, సంతోషరాణి, హరిప్రసాద్‌గౌడ్, మండల నాయకులు బాలీశ్వర్, రవిగౌడ్, సైదులు, రాజేష్‌గౌడ్, పర్వతాలు, ఖాజా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.