మహబూబ్‌నగర్

దేశవ్యాప్తంగా తెలంగాణకు ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, జనవరి 18: తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకుపోతుందని దేశవ్యాప్తంగా రాష్ట్రానికి ప్రశంసలు లభిస్తుంటే బీజేపీ నాయకులు రాష్ట్రంలో మాఫియా పెరిగిపోయిందని మాట్లాడటం అర్థరహితమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. గురువారం జడ్చర్లమండల పరిధిలోని పలు గ్రామాలల్లో అబివృద్ధి పనులలో పాల్గొన్న ఆయన ఈసందర్భంగా గంగాపూర్ గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో మాఫియాను అణగదొక్కుతున్నట్లు పేర్కొన్నారు. మాఫియాకు మారుపేరైన కాంగ్రెస్‌ను విమర్శించాల్సిందిపోయి మాఫియాను అణిచివేస్తున్న తమ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వంలో మాఫియా ఆగడాలను పరిశీలించి ఇప్పటి పరిస్థితులను ఒక సారి అవగాహన చేసుకోవాల్సిన అవసరముందని ఉద్బోధించారు. గత కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా భూకబ్జాలు, ఇసుక మాఫియాలో చేతులు కలిపారని ప్రస్తుత తమ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలు ఎవ్వరూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కాని మాఫియాతో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన వివరించారు. కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు చేసిన కుంభకోణాలకు కాంగ్రెస్‌ను స్కాంగ్రెస్‌గా పిలిపించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రభుత్వం అమలు పరుస్తుందని దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని వివరించారు. రాష్ట్రంలో పోలీసులు అమలు పరుస్తున్న ఫ్రెండ్లీ పోలిసింగ్ ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లోనూ కల్తీలే కనిపించేవని కాని తమ ప్రభుత్వం కల్తీలపై కఠిన వైఖరితో వ్యవహరిస్తున్నామని, అవసరమైతే పీడీ యాక్టును సైతం పెట్టేందుకు సైతం వెనకాడటంలేదని తెలిపారు. సమగ్ర నేరస్తుల సర్వే ఓ వినూత్న కార్యక్రమమన్నారు. ఎక్కడా నేరాలు జరిగినా త్వరితగతిన గుర్తించవచ్చని తెలిపారు. అలాగే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలంటే పట్టణ పరిసరాలలో సుమారు రెండు ఎకరాల భూమి అవసరం అవుతుందని అందువల్ల పట్టణంలో ఏదైనా అద్దె భవనంలో తాత్కలికంగా వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించి అనంతరం శాశ్వత భవనాన్ని నిర్మిస్తామన్నారు. మాతా శిశుసంరక్షణ కోసమే 102 ద్విచక్ర వాహన అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకుగానూ చేపడుతున్న చర్యల్లో భాగంగా 102 అంబులెన్సులను ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం అల్వాన్ పల్లి నుండి నసరుల్లాబాద్ వరకు బీటీ రోడ్డుకు శంఖుస్థాపన, చెర్లపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, మేఘనాథ్ చౌహాన్ తండాలో బీడీ రోడ్డు నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు. ఈకార్యక్రమాలల్లో ఎంపీపీ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ శోభ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, నాయకులు గోవర్థన్ రెడ్డి, జంగయ్య, దర్శన్, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు.

19లోగా వివరాలు సమర్పించండి
* కలెక్టర్ శే్వతా మహంతి ఆదేశం *కొత్త పంచాయతీల ఏర్పాటుపై సమీక్ష
వనపర్తి, జనవరి 18: కొత్తగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న గ్రామ పంచాయతీల వివరాలను మ్యాప్‌లతో సహా ఈ నెల 19వ తేదీలోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. కొత్త పంచాయతీల ప్రతిపాదనల కోసం గురువారం పంచాయతీ, తహశీల్దార్, ఎంపీడీఓ, వీఆర్‌ఓలతో ఆర్డీఓ కార్యాలయం హాలులో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కనీసం 500 జనాభా, ప్రస్తుత హ్యాబిటేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాలన్న అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త గ్రామ పంచాయితీలను ప్రతిపాదించాలని ఆదేశించారు. కొత్త గ్రామ పంచాయతీల డీమార్కేషన్, బౌండరీల ఏర్పాటు ఎంపీడీఓ, ఈఓఆర్‌టీలు చేయాలని, డీమార్కేషన్‌ను వెంటనే చేపట్టాలని అన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొత్త పంచాయతీల డీమార్కేషన్, బౌండరీల వంటివి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భూరికార్డుల శుద్ధీకరణకు నియమించిన మండల స్థాయి బృందాన్ని కొత్త పంచాయతీల ఏర్పాటు కూడా సహకారం తీసుకోవాలని సూచించారు. మ్యాపులలో తప్పనిసరిగా భూములకు సంబంధించిన నంబర్లను రాసి ఇవ్వాలని, మ్యాప్ హార్డ్‌కాపీపై తహశీల్దార్, ఎంపీడీఓ, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి సంతకాలు చేసి 19లోగా సమర్పించాలని ఆదేశించారు. కొత్త పంచా యతీల ఏర్పాటుకు తీసుకోవలసిన అంశాలు, పట్టికలు, మ్యాపుల తయారీని కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ చంద్రయ్య, డీపీఓ వీరబుచ్చయ్య, ఆర్డీఓ చంద్రారెడ్డి, సర్వే ల్యాండు రికార్డుల ఏడీ బాలకృష్ణ, సీపీఓ రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.