మహబూబ్‌నగర్

తెలంగాణలో రాజరిక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జనవరి 20: ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగుతున్నదని, ఒక రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఒక రాజ్యానికి రాజుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు ఆరోపించారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశలను వమ్ముచేస్తూ తన ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తూ రాష్ట్రంలో ప్రశ్నించేవారే లేకుండా నియంతృత్వంగా సీఏం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలన చూస్తుంటే హిట్లర్ పాలన గుర్తుకు వస్తుందని, ఆయన మంత్రి వర్గంలో అబద్ధాలు చెప్పేందుకు గోబెల్‌ను నియమించుకున్నారని, కాని కేసీఆర్ మాత్రం ఆయనే హిట్లర్‌గా, గోబెల్‌గా వ్యవహరిస్తున్నారని తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలను అమలు చేయకుండా మాయమాటలతో ప్రజలను ఊహాలోకంలోకి తీసుకొనిపోతున్నాడని విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలలో కోట్లాది రూపాయల దుర్వినియోగమవుతున్నదని, వీటికోసం ఖర్చు చేసిన వివరాలతో శే్వతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలులేని మంత్రివర్గం ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి అని, కూతురైన నిజామాబాద్ ఎంపి కవితకు ప్రోటోకాల్ ప్రకారం తగిన ప్రాధాన్యత దక్కదనే ఉద్దేశంతోనే మంత్రి మండలిలో మహిళలకు స్థానం కల్పించలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పాలనపై రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉందని, కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి, స్కాంల పార్టీ అనే అభిప్రాయం ప్రజలలో ఉన్నందున రాబోయే రోజులలో ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా బహుజన లెప్ట్‌ఫ్రంట్ వైపు చూస్తున్నారని అన్నారు. అంబేద్కరిస్టులు, లెప్ట్‌స్టులు గతంలో ఎన్నడూ కలవలేదని, ఈనాడు ఈ రెండు వర్గాలు కలిసి ప్రజలముందుకు వస్తున్నాయన్నారు. ఈనెల 25న హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభలో బహుజల లెప్ట్ ఫ్రంట్ విధానాలను ప్రకటించడం జరుగుతుందని, అందరికి ఉచిత విద్య, ఉచిత వైద్యంను కల్పించేవిధంగా స్పష్టమైన విద్యావిధానం, వైద్యవిధానంను ప్రకటించడం జరుగుతుందని, స్వామినాథన్ కమిటీ నివేదికను అమలుచేసేవిధంగా వ్యవసాయ విధానంతోపాటు బహుజనుల సంక్షేమం, అభివృద్ది తదితర వాటిపై స్పష్టమైన ప్రకటన చేయడం జరుగుతుందన్నారు. 97శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తామని, రాబోయేది బహుజనులకే అధికారం లభిస్తుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో వివిధ పార్టీల నాయకులు కిల్లె గోపాల్, ఆచార్య వెంకటదాసు, పర్వతాలు, గీత, ఆర్.శ్రీనివాసులు, దేశ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

సాగునీటిని వృథా కానివ్వద్దు
* ఎస్‌ఇ భద్రయ్య
పాన్‌గల్, జనవరి 20: రైతులు వేసిన యాసంగి పంటలను కాపాడుకునేందుకే కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేయడం జరిగిందని ఎస్‌ఇ భద్రయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని బండపల్లి, జమ్మాపూర్, కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి, మాందాపూర్, చింతకుంట గ్రామాల మీదుగా వెళ్ళే సాగునీటి కాల్వలను ఆయన పరిశీలించారు. రైతులు సాగునీటిని వృథా చేయవద్దని పంటలకు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. పంటలు పూర్తయ్యేవరకు కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపి రైతులకు సాగునీటిని అందిస్తామన్నారు. మంత్రి జూపల్లి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిలు సాగునీటిని విడుదల చేయాలని ఆదేశించడంతోనే సాగునీటిని విడుదల చేసినట్లు తెలిపారు. భీమా, కేఎల్‌ఐ కాల్వల ద్వారా యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, ఈఈ ఉమాపతి, డీఈ సుధాకర్‌రావు, ఏఈలు ఆంజనేయులు, ఖధీర్, కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.