మహబూబ్‌నగర్

రైల్వే డబ్లింగ్ పనులపై రైల్వే జీఎం సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, జనవరి 20: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం వరకు చేపట్టిన రైల్వే డబ్లింగ్ పనుల పురోగతి విషయాలపై రైల్వే జీఎం వినోద్ కుమార్, ఎన్‌హెచ్‌ఎఐ ఆర్‌ఓ కృష్ణ ప్రసాద్‌లు శనివారం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారం కోసం ఎంపీ జితేందర్ రెడ్డి చొరవతో జడ్చర్ల ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమీక్షలో రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్‌తో పాటు, రైల్వే ఉన్నత అధికారులు సుదీర్ఘంగా సమీక్ష సమావేశాలను నిర్వహించారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ అనురాధ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పనుల పురోగతిపై జీఎం ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ రైల్వే డబ్లింగ్ పనుల నిర్వహణలో, జాతీయ రహదారి విస్తరణలో తలెత్తుతున్న సమస్యల గురించి జీఎం, ఆర్‌ఓలకు వివరించారు.
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డబ్లింగ్ పనుల నిర్వహణ వల్ల రైల్వే ప్రయాణం జిల్లా ప్రజలకు ఎంతో సులువవుతుందన్నారు. పనుల నిర్వహణలో భాగంగా చేపట్టాల్సిన పనుల గురించి మంత్రి అధికారులకు వివరించారు. జడ్చర్లలో ఎల్‌సి నెంబర్ 47 దగ్గర ఆర్‌ఓబి, ఎల్‌సి నంబర్ 49 వద్ద ఆర్‌ఓబీ ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత గురించి అధికారులతో చర్చించగా వారు అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఎల్‌సి నంబర్ 49 వద్ద ఆర్‌ఓబి ఎర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తొలిగే అవకాశం ఉందని అన్నారు. ఆర్‌ఓబీ ఏర్పాటుకు రైల్వే శాఖ 50 శాతం భరిస్తుందని, మరో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఆర్‌ఓబీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జీఎం వెల్లడించారు. ఆర్‌ఓబీ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సగమవుతుందని మంత్రి అన్నారు. రైల్వే డబ్లింగ్ పనుల ఏర్పాటుకు ఎంపీ జితేందర్ రెడ్డి ఎంతో చొరవ తీసుకున్నారని ఆయన కృషి వల్లే డబ్లింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మాచారం, కావేరమ్మపేట, జానంపేట్ మూసాపేట్, జింకలపల్లి, అడ్డాకుల తదితర ప్రాంతాలలో జాతీయ రహదారి విస్తరణలో చేపట్టాల్సిన పనుల గురించి మంత్రి ఆర్‌ఓ కృష్ణప్రతాప్ కు వివరించారు. తొండుపల్లి నుండి కర్నూల్ వరకు జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించిన చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తొండుపల్లి నుండి కర్నూల్ వరకు చేపట్టే జాతీయ రహదారి విస్తరణలో ఉన్న సమస్యలను అధికారులు క్షుణ్ణంగా వివరించారు. వచ్చే ఎన్నికల నాటికి డబ్లింగ్ పనుల వేగంలో ఫలితాలు కనిపిస్తాయన్నారు. జడ్చర్ల-మహబూబ్‌నగర్ వరకు రూ.85కోట్లతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు. డబ్లింగ్ పనుల నిర్మాణంలో భాగంగా మహబూబ్‌నగర్‌లోని టీడీ గుట్ట వద్ద ఆర్వోబీ, దేవరకద్ర వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్వోబీ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. మూడు నెలల క్రితమే జీఎంను కలిసి సమీక్ష నిర్వహించాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు. దివిటిపల్లి-మహబూబ్‌నగర్, షాద్‌నగర్-ఉందానగర్ వరకు డబ్లింగ్ పనులు ఎన్నికల నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. కొత్తకోట వరకు డబ్లింగ్ పనులు విస్తరించాలని ఆయన జీఎంను కోరారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గ పరిధిలో చేపట్టే డబ్లింగ్ పనుల నిర్వహణలో తలెత్తే సమస్యలను పరిష్కారించాలని కోరారు. పనుల నిర్వహణకు సంబంధించి అధికారులు తాము చర్చించిన సమస్యల పరిష్కారానికి అధికారులు సానుకూలంగా స్పందించడం వల్ల ప్రజాప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.