మహబూబ్‌నగర్

‘పంచాయతీ‘ ప్రత్యక్షంగానే నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 22: గత మూడున్నర ఏళ్ల టీఆర్‌ఎస్ పాలనలో స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వీర్యం చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేశారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ ఆరోపించారు. సోమశారం మహబూబ్‌నగర్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించాలని చేస్తున్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన దాదాపు నాలుగేళ్లు గడుస్తుందని ఆయన పాలనలో ప్రత్యేకంగా గ్రామపంచాయతీలకు ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు లేకుండా నియంతగా వ్యవహరించారని విమర్శించారు. గ్రామాల రూపురేఖలు మారుస్తానని ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ఎంతో అట్టహాసంగా మన ఊరు, మన ప్రణాళికల పేరిట హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. గ్రామజ్యోతి లాంటి పథకాలు ఆర్భటంగా ప్రకటించిన ఒక్కపైసా కూడా అందుకు కేటాయించలేదని అన్నారు. సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనుడు కేసీఆర్ అని ఆరోపించారు. ఆరునెలల ముందుగానే సర్పంచుల ఎన్నికలు నిర్వహిస్తే ప్రస్తుతం ఉన్న సర్పంచుల గౌరవాన్ని కించపర్చినట్లేననే విషయాన్ని కేసీఆర్ గుర్తించుకోవాలని హితవు పలికారు. ఆగస్టు 1వరకు సర్పంచుల పద్య్పకాలం ఉన్నందున జూలైలో ఎన్నికలు నిర్వహించి గ్రామపంచాయతీ చట్టాలను ముఖ్యమంత్రి గౌరవించాలని కోరారు. పరోక్ష ఎన్నికల పద్ధతితో రాజకీయ ఫిరాయింపులను మరింత ప్రొత్సహించేవిధంగా టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్నారని పరోక్షంగా పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామాల్లో వ్యవస్థ అంతా నాశనమై అల్లర్లకు గ్రామాలు కేంద్ర బిందువుగా మారనున్నాయని ఇందుకు కేసీఆర్ బాధ్యుడు కావల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రత్యక్ష ఎన్నికలే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలే జరపాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేసి పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలను అందజేస్తామన్నారు. ఈనెల 27న నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు విన్నవిస్తామన్నారు. ఈనెల 30న జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నామని అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. విలేఖరుల సమావేశంలో దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి పవన్‌కుమార్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రంగారావు, నరసింహరెడ్డి, బ్రహ్మయ్య, బెనహర్ పాల్గొన్నారు.