మహబూబ్‌నగర్

దళారీలు లేకుండానే ఇసుకను అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జనవరి 22: దళారీలు లేకుండానే ఇసుకను సజావుగా అందజేస్తామని కలెక్టర్ శే్వతా మహంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో తహశీల్దార్‌ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇసుక ట్యాక్సీ విధానాన్ని అమలు చేస్తూ తహశీల్దార్ పరిధిలో ఉన్న ఇసుక రీచ్‌లను గ్రామాల మ్యాపింగ్ తయారు చేయాలని ఆదేశించారు. ఇసుక ట్యాక్సీ విధానంపై రెవెన్యూ, మైనింగ్, ఆర్డీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ విధానం రాష్ట్రంలో పెద్దపల్లి, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో విజయవంతంగా నడుస్తుందని, జిల్లాలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఈ విధానంతో ఇసుక అత్యవసరమున్న వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకోవలసి ఉంటుందన్నారు. దూరాన్ని బట్టి ఇసుక ఖరీదు, రవాణా చార్జీలు కలుపుకొని నిర్ణయించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా 24 గంటల్లో లబ్ధిదారులకు ఇసుకను అందించేందుకు జర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధానంలో ఇసుకను సరఫరా చేసే ట్రాక్టర్ యజమాని ముందుగా తహశీల్దార్ వద్ద పూర్తి వివరాలు రిజిస్టేషన్ చేసుకోవలసి ఉంటుందన్నారు. జిల్లాలో ఇసుక అందుబాటులో లేకుంటే పక్క జిల్లా నుండి ఇసుక తీసుకరావడానికి వెసులుబాటు ఉందన్నారు. అందుకు గాను కలెక్టర్ అధ్యక్షతన గనుల శాఖ ఏడీ కన్వీనర్‌గా ఆర్డీఓ, డిఆర్‌ఓ, ఆర్టీఓ, తహశీల్దార్లు సభ్యులుగా ఇసుక నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. లబ్ధిదారుడు ఇసుక బుక్ చేసుకున్న అనంతరం ఇసుక ఎప్పటి నుండి ఎప్పుడు వస్తుందో ట్రాక్టర్ నంబర్‌తో సహా లబ్ధిదారుని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుందన్నారు. గద్వాలలో ఈ విధానం అమలు చేస్తున్నా వర్టోనిక్ సంస్థ ప్రతినిధి ఎన్‌ఎస్ నిశ్చల్ ఇందుకు సంబంధించిన వివరాలను రూపొందించి యాప్‌ను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఇసుక టాక్సీ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రామన్‌పాడు ఇసుక రీచ్ నుండి మాత్రమే టీఎస్ ఎండీసీ నుండి ప్రభుత్వం పనులకు మాత్రమే ఇసుకను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ నిరంజన్, డీఆర్‌ఓ చంద్రయ్య, గనుల శాఖ ఏడి మల్లిఖార్జున్, ఆర్టీఓ నరేందర్, ఆర్డీఓ చంద్రారెడ్డి పాల్గొన్నారు.