మహబూబ్‌నగర్

వర్ధంతి లేని వీర నాయకుడు నేతాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, జనవరి 23: భారతదేశ చరిత్రలో జయంతి మాత్రమే ఉండి వర్థంతి లేని వీర నాయకుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని నేతాజీ ఫ్రెండ్స్ చైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలో నేతాజీ జయంతి వేడుకలను సోమవారం వైభవంగా నిర్వహించారు. నేతాజీ విగ్రహనికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మాజి ఎంపీ మంద జగన్నాథం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బీఎస్ కేశవ్ పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం నేతాజీ ఫ్రెండ్స్ చైతన్య సేవా సమితి కార్యదర్శి వెంకట్రామయ్య శేట్టి అధ్యక్షతన కొనసాగిన కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర సంగ్రామంలో చరిత్రలో నిలిచిపోయే మహోన్నతమైన పాత్ర కలిగిన అగ్రశ్రేణి నాయకుడని కొనియాడారు. 23వ యేటనే అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యాడని, ఆకాలంలోనే దేశవ్యాప్తంగా యువతను ఉత్తేజ పరిచరన్నారు. నేతాజీ ఇంతవరకు మరణించినట్లు ఆధారాలు ఎక్కడా లేవని భూమి, మానవ జాతి, భారతదేశం ఉన్నంత వరకు బహుశ మరణం లేని వీరనాయకుడిలా చరిత్రలో నమోదుడయ్యాడని ఆయన పేర్కొన్నారు. ఎదిగే పిల్లలకు భావితరాల వాళ్లకు, యువతకు స్ఫూర్తిదాయకమైన పోరాట స్ఫూర్తినిచ్చే నాయకుడే నేతాజీ అని అన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా విద్యార్థులు, చిన్నారులు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. వసంతకుమార్ అనే ఉపాధ్యాయుడు నేతాజీ వేషాధారణలో ఉపన్యసించి నవ నేతాజీగా ఆకట్టుకున్నారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు, సాంఘికశాస్త్రం ఉపాధ్యయుడు నాగరాజు, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మాజీ ఎంపి మంద జగన్నాథంను నేతాజీ ఫ్రెండ్స్ చైతన్య సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సూర్యబాబు గౌడ్, సర్పంచ్ జయరాముడు, మార్కెట్‌యార్డ్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు నారయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్, ఎంఈఓ అశోక్‌కుమార్, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.