మహబూబ్‌నగర్

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కాల్వ పనుల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, ఫిబ్రవరి 18: మరికల్ మండల పరిధిలోని తీలేర్ గ్రామసమీపంలో కొనసాగుతున్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు 16వ డిస్టీబ్యూటర్ పనులను ఆదివారం నారాయణపేట మార్కెట్ కమిటి వైస్‌చైర్మన్ వై.వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. కో యిల్‌సాగర్ ప్రాజెక్టు 16వ కాల్వ పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరును అ ందిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ తీలేర్ గ్రామసర్ప ంచ్ సౌరప్ప, ఎంపిటీసీ తిరుపతమ్మ, నాయకులు అశోక్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, పెంటన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన సత్రానికి 100 క్వింటాళ్ల బియ్యం పంపిణీ
మక్తల్, ఫిబ్రవరి 18: సేవాభావంలో ఉన్న ఆనందం మరెందులో లేదని, తనకున్న వాటిలో తోటివారికి కొంతైనా సహాయాన్ని అందించినప్పుడే మనలో సేవాభావం పెరుగుతుందని, ఇది గ్రహించిన తాను కర్నాటకలోని ఉడిపి అన్నదాన సత్రానికి 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఇవ్వడం జరిగిందని మక్తల్ ఎంపిపి గడ్డంప ల్లి హన్మంతు అన్నారు. ప్రతిఒక్కరిలో ఆధ్యాత్మిక చింతనభావం రావాలని, మనిషి అధ్యాత్మిక చింతనలో నడిచాడంటే సేవాభావం సైతం వస్తుందని అన్నా రు. రైతుబిడ్డగా ఉన్న తనకు ప్రజల ఆధరాభిమానాలతో తన తోటి ఎంపిటిసిల సహాయ సహకారాలతో నేడు మక్తల్ ఎంపిపిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకై తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారం ఉన్నంతవరకు తాను వారి సేవకై పరితపిస్తానని ఎంపిపి హన్మంతు అన్నారు.