మహబూబ్‌నగర్

ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడ్జిల్, ఫిబ్రవరి 18: ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో ముందుండాలని వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎంవిఎస్ ఫం క్షన్‌హల్‌లో నిర్వహించిన ఆర్యవైశ్యుల మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాని కి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్యులు గ్రామాల్లో క్రమశిక్షణగా ఉంటూ వ్యాపారపరంగానీ, సేవాదృక్పథంలో కానీ రాజకీయపరంగానీ ముందుండాలన్నారు. ఆర్యవైశ్యులకు తమవంతు సహాయసహకారాలు భవన నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు పేపర్ శ్రీను, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా నా యకులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా జమ్ములమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
ధన్వాడ, ఫిబ్రవరి 18: మరికల్ మండల కేంద్రంలోని రైల్యేస్టేషన్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మాణం చేసిన శ్రీశ్రీశ్రీ జమ్మలమ్మ దేవాలయంలో శ్రీశ్రీ శ్రీ జములమ్మ విగ్రహా ప్రతిష్టపన కార్యక్రమం కన్నులపండువగా కొనసాగింది. అనంతరం ప్రతిష్ట సంకల్పం, గణపతిపూజ, పూణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన, కంకణధారణ, నవగ్రహపూజ, మాతృకా, సర్వతోభద్ర, వాస్తుదేవతా, ఆవాహ న, ఆరాధన, విగ్రహయాంత్ర, అగ్నిఉత్తారణ, నేత్రబంధం, అగ్నిప్రతిష్ట తీర్థప్రసా ద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కా ర్యక్రమం నిర్వహించారు. ఈ పూజాకార్యక్రమానికి ధన్వాడ ఎంపిపి శశికళ, మరికల్ పట్టణ సర్పంచ్ జోగులక్ష్మీ, ఎంపిటీసీ వీరన్న, దేవాలయం నిర్వాహకులు సురేంద్రర్‌గౌడ్, నాయకులు చెన్నకేశవులుగౌడ్, రామన్‌గౌడ్, నాయకులు కుర్వగోపి, మరికల్ ఎంపిటీసీ వీరన్న, సౌభాగ్యలక్ష్మీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నేడు ధన్వాడకు సబ్‌కలెక్టర్, డిఇఓ రాక
ధన్వాడ, ఫిబ్రవరి 18: ధన్వాడ మండల కేంద్రంలో నిర్వహించే ఉపాధ్యాయుల మండలస్థాయి భోదన ఉపకరణాముల ప్రదర్శన మేళ కార్యక్రమానికి జిల్లా సబ్ కలెక్టర్, డిఇఓలు వస్తున్నట్లు ధన్వాడ ఎంఇఓ సంగీత తెలిపారు. ఆదివారం ధన్వాడ ఎంఇఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ధన్వాడ మండల కేంద్రంలో నిర్వహించే ఉపాద్యాయుల భోధన మేళ కార్యక్రమానికి ఐఇసి రాష్ట్ర కో-ఆర్డీనేటర్ ఈశ్వరయ్య, వెంకటనర్సయ్య, ధన్వాడ ఎంపిడిఓ, ధన్వాడ ఎంపిపి, మండల జడ్పీటీసీలు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. మండలంలో ఉన్న ఉపాధ్యాయులు తప్పకుండా హాజరుకావాల ని కోరారు. విలేకరుల సమావేశంలో సిఆర్‌పిలు వెంకట్రాములు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.