మహబూబ్‌నగర్

త్యాగాలు మావి...్ఫలాలు దొరలవి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, ఫిబ్రవరి 18: 1969, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరు లు 1200 మంది అయితే అందులో ఆత్మ త్యాగం చేసుకున్నది బడుగు, బలహీన వర్గాలవారు 1100 మంది ఉ న్నారని, త్యాగము మేము చేస్తే ఫలిత ం దొరలు అనుభవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ ఉంఘం అ ధ్యక్షులు జాజుల శ్రీనివాసులు అ న్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బిపిఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా బిసి సంఘం మహాసభ నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్ గౌడ్ వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు వెనకబడి పోయారని, అగ్రకులాలవారు అధిపత్యం కొనసాగుతుందని, రాజ్యాధికారం కోసం బిసిలంత ఏకతాటిపై రావాలని, జనాభా ప్రకార ం బిసిలకు రిజర్వేషన్లలో 50శాతం కల్పించాలని, వచ్చే ఎన్నికల్లో బిసిల ను విస్మరించిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. స్ధానిన సంస్ధల ఎన్నికల్లో తో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు తగిన న్యాయం చేయాలని ఆయన అ న్నారు. పార్టీ అతీంతంగా బిసిలంతా సంఘటితం కావాలని, ఓటు అనే వజ్రయుద్దం ద్వార పాలకులకు గుణపాఠ ం చెప్పాలన్నారు. బిసిలు తమ ఆత్మగౌరవాన్ని తాకటు పెట్టవద్దని ఆయన హితవు పలికారు. విద్యార్ధులు విద్య రాణించాలని, విద్య లేకపోవడంవల్ల ఉన్నత స్ధానంకు ఎదగలేకపోతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో బిసిల సత్తా చాటాలని, జిల్లాలోని 7 అసెంబ్లీ స్ధానా లు, 1 పార్లమెంట్ స్ధానాన్ని బిసిలకు కేటాయంచాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బిసిలు ఎక్కువ స్ధానాల్లో పోటీ చేయాలని, సియం కూడా బిసి కావాలని, అ లాంటి లక్ష్యంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బిసి సంఘం నాయకు లు టి.ఆచారి, ఎగ్గని నరిసింహులు, జడ్పిటిసి రామన్‌గౌడ్, రామస్వామి, రామకృష్ణ, కృష్ణయ్య, రాములు యా దవ్, సత్యం యాదవ్, నాగన్న సాగర్, సాయాలు యాదవ్, లతీఫ్, మిషేక్, కృష్ణసాగర్, తిరుపయ్య తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని జిల్లా బిసి మహాసభ నిర్వహించగా అందులో గాయని మంగ్లీ పాడిన పాటలు పలువురిని ఆకుటుకున్నాయి. మంగ్లీ పాటలకు యువత, యువతులు నృతాలు చేశారు. అలాగే జంగిరెడ్డి బృందంచే దూందాం కార్యక్రమాన్ని నిర్వహించారు.