మహబూబ్‌నగర్

రచయితలు, కవులు సమాజ మార్పు కోసం కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, ఫిబ్రవరి 18: సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచే విధంగా కవులు, రచయితలు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని మహబూబ ఫంక్షన్‌హాల్ లో కొల్లాపూర్ శతాదిక కవుల సమ్మెళనం జరిగింది. ఈ సమ్మెళనానికి ప్రముఖ రఛయిత అమని కృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరయిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జటప్రోలు సంస్థానం కవులకు, రచయితలకు ఎంతో ప్రాముఖ్యత తెచ్చిందని ఎందరో కవులు ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించి సమాజ సేవ చేశారని, రాజులు పోయారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి కవులలో, రచయితలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. సమాచార వ్యవస్థలో మార్పులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో తెలుగు మ హాసభలలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నభూతో నభవిష్యత్తుగా నిర్వహించారని గుర్తుచేశారు. వచ్చే ఏప్రిల్‌లో కొల్లాపూర్ సంబరాలు నిర్వహిస్తున్నామని ఆ సంబరాలలో కవులకు, రచయితలకు విరివిగా చోటు కల్పిస్తామన్నారు. మాతృభాషపైన ఎందరో కవులు రచయితలు, ప్రసంగాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రఘురామ్ శర్మ, సంపత్ శర్మ, పెద్దూరి వెంకటదాసు, జనార్ధన్ తదితరులు ప్రసంగించారు. కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన దాదాపు 80 మంది కవులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్న ని రంజన్‌రావు, సింగిల్‌విండో అధ్యక్షులు రఘుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్బాల్, మాజీ ఎంపీపీ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం
* మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 18: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణను సాధించుకున్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నాగం జనార్ధన్‌రెడ్డి చాకలి ఐలమ్మ మనవడు చాకలి రా మచంద్రంతో కలిసి ఆవిష్కరించారు.